AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌందర్య స్నేహితురాలిగా నటించిన స్టార్ యాంకర్.. బుల్లితెర పై తిరుగులేని క్రేజ్ ఆమెది..

తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత సౌందర్య. ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్. అద్భుతమైన నటన.. సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్.

సౌందర్య స్నేహితురాలిగా నటించిన స్టార్ యాంకర్.. బుల్లితెర పై తిరుగులేని క్రేజ్ ఆమెది..
Soundarya
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2025 | 4:53 PM

Share

సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్‏గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే.. ఎలాంటి స్కీన్ చేయకుండానే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సౌందర్య స్థానం ప్రత్యేకం. కళ్లతోనే ఎన్నో భావాలను పలికించగల అరుదైన నటిగా గుర్తింపు పొందారు సౌందర్య. అందుకే ఆమెను అంతా అభినవ సావిత్రి అంటుండేవారు. టాలీవుడ్ లో అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న సౌందర్య ఎక్కడా కూడా గ్లామర్ పాత్రలు చేయకుండా.. చీరకట్టుతోనే సూపర్ హిట్స్ అందుకున్నారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సౌందర్య కేవలం 31 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే ఓ స్టార్ యాంకర్ సౌదర్యతో కలిసి నటించారన్న విషయం మీకు తెలుసా.? ఆమె ఎవరో కాదు.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

టెలివిజన్ లో స్టార్ యాంకర్ గా రాణిస్తున్న సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి షో అయినా.. ఎలాంటి ఈవెంట్ అయినా.. సుమ తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఎంత పెద్ద ఈవెంట్ అయినా సుమ అవలీలగా హ్యాండిల్ చేయగలదు. ఎన్నో టీవీ షోలు, టాక్ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసింది సుమ.. అయితే సుమ సినిమాల్లోనూ నటించిందని తెలుసా.. అవును సుమ కనకాల కొన్ని సినిమాల్లో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో ప్రభాస్ అక్కగా నటించింది. అలాగే ఈ మధ్య జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించింది. సుమ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

అలాగే సుమ అలనాటి అందాల తార సౌందర్యంతో కలిసి నటించిందని చాలా మందికి తెలియకపోవచ్చు.. అవును సుమ సౌందర్య కలిసి నటించారు. సౌందర్య, సుమ కలిసి నటించారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు.. ఆ సినిమా పేరు కలిసి నడుద్దాం.! ఈ సినిమాకు కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ నటించారు. 2001లో విదులైన ఈ సినిమాలో సుమ కనకాల చిన్న పాత్రలో నటించింది. సుమ ఈ సినిమాలో సౌందర్య స్నేహితురాలుగా కనిపించింది. ఇందుకు సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..