AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు హోటల్‌లో పని.. ఇండస్ట్రీలో తోప్.. రాజకీయాల్లో టాప్.. ఈమె ఎవరో తెలుసా.?

ఒకప్పుడు ఆమె బుల్లితెర ప్రేక్షకులకు ఇష్టమైన నటి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా టీవీ పరిశ్రమను ఒక్క పాత్రతోనే ఏలింది. అద్భుతమైన యాక్టింగ్, చూడచక్కని రూపంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఇప్పుడు అదే సీరియల్ తిరిగి వస్తుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ సీరియల్ నటి తిరిగి ఇండస్ట్రీలోకి రాబోతుంది.

ఒకప్పుడు హోటల్‌లో పని.. ఇండస్ట్రీలో తోప్.. రాజకీయాల్లో టాప్.. ఈమె ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 01, 2025 | 7:28 PM

Share

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు చాలా మంది. కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. మరికొంతమంది స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. చిన్న చిన్న పనులు చేసిన వారు.. ఒక్కపూట తిండికోసం కష్టపడినా వారు కూడా చాలా మంది ఉన్నారు. పైన కనిపిస్తున్న నటి కూడా జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంది. పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు చూసింది. ఒకప్పుడు హోటల్‌లో అంట్లు కడిగింది. కట్ చేస్తే సినిమాల్లోకి అడుగు పెట్టింది. సీరియల్స్ లో నటించింది. ఆతర్వాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. ఇక ఇప్పుడు తిరిగి సీరియల్స్ లో నటిస్తుంది ఆమె..

ఇది కూడా చదవండి :కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఆమె ఎవరో కాదు స్మృతి ఇరానీ. ఢిల్లీలో ఒక పంజాబీ-బెంగాలీ కుటుంబంలో జన్మించింది స్మృతి ఇరానీ. మరియు రాజకీయాల్లోకి రాకముందు టెలివిజన్ రంగంలో విజయవంతమైన వృత్తిని కలిగి ఉంది, ముఖ్యంగా “క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ” సీరియల్‌లో తులసి విరాణీ పాత్ర ద్వారా ప్రసిద్ధి చెందింది. ఆమె గతంలో మోడలింగ్ చేసింది, టీవీ కార్యక్రమాలకు యాంకర్‌గా కూడా పనిచేసింది. కాగా జీవితంలో స్మృతి ఇరానీ ఎన్నో కష్టాలను చూసింది. చిన్న చిన్న పనులు చేసి ఆమె తన కుటుంబాన్ని పోషించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్

మొదట్లో కాస్మొటిక్స్‌ అమ్మింది. ఆ పనికి రూ. 200 జీతం అందుకుందట.. ఆతర్వాత 20 ఏళ్ల వయసులో భారతదేశంలోని మొట్టమొదటి మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లో పని చేరింది. అక్కడ గిన్నెలు కడిగే పని చేసిందట. ఆతర్వాత ఆమె సినిమా రంగం వైపు అడుగులేసింది. పలు ఆడిషన్స్ ఇచ్చింది. కొన్ని మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆతర్వాత సీరియల్స్ వైపు అడుగులేసింది. సీరియల్ లో స్టార్ గా ఎదిగింది స్మృతి ఇరానీ. రామాయణం అనే టీవీ సీరియల్‌లో సీతగా కూడా నటించింది. ఇక సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న ఆమె రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. 2003లో బీజేపీలో జాయిన్ అయ్యారు. మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ ఇప్పుడు తిరిగి సీరియల్స్ లో నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేశాడు.. ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నాడు.. అతను ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.