ఇదేం ట్విస్ట్ మావ..! ఈ సీనియర్ నటి చెల్లి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయినా..!
చాలా మంది సీనియర్ నటీమణులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి కీలక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో సుహాసిని ఒకరు. ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఆమె, తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ భామ.

సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ సినిమాలు చేస్తూ రాణిస్తున్న వారిలో సుహాసిని ఒకరు. సుహాసిని గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు సుహాసిని. తన నటీనతో హావభావాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సుహాసిని. తెలుగులో సుహాసిని 50కి పైగా సినిమాలు చేశారు. అలాగే తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు ఈ స్టార్ నటి. సుహాసిని కేవలం నటి మాత్రమే కాదు దర్శకురాలిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికి కూడా సుహాసిని సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మణిరత్నంను వివాహం చేసుకున్న తర్వాత ఆమె హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేశారు.
ఇది కూడా చదవండి :కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఇదిలా ఉంటే సుహాసిని చెల్లి ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్, అంతే కాదు పాన్ ఇండియా హిట్స్ అందుకొని దూసుకుపోతుంది. ఆమె ఎవరో తెలుసా.? ఆమె మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్.. కానీ ఆమె సుహాసిని సిస్టర్ అని చాలా మందికి తెలియక పోవచ్చు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్. అవును శ్రుతిహాసన్, సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్
సుహాసిని తండ్రి, కమల్ సొంత అన్నా తమ్ముళ్లు. దాంతో శ్రుతి , సుహాసిని అక్కాచెల్లెళ్లు అవుతారు. ఇక శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాతెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ అమ్మడు. తెలుగులో శ్రుతి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం శ్రుతి సలార్ 2తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది.
ఇది కూడా చదవండి : ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేశాడు.. ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నాడు.. అతను ఎవరంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








