AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్టర్ హైదరాబాద్‌గా ఏడుసార్లు అవార్డులు.. కట్ చేస్తే టాలీవుడ్‌లో తిరుగులేని నటుడు

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొని సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. కొంతమంది హీరోలు గా, డైరెక్టర్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, అలాగే విలన్స్ గానూ మారి సక్సెస్ అయ్యారు

మిస్టర్ హైదరాబాద్‌గా ఏడుసార్లు అవార్డులు.. కట్ చేస్తే టాలీవుడ్‌లో తిరుగులేని నటుడు
Tollywood Hero
Rajeev Rayala
|

Updated on: Jul 30, 2025 | 2:28 PM

Share

తెలుగు సినిమాల్లో ఎంతో మంది ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ గా మారిన నటులు చాలా మంది ఉన్నారు. పైన కనిపిస్తున్న హీరో కూడా వారిలో ఒకరు. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన స్టార్ గా ఎదిగాడు. విలన్ గా,హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? నటుడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఆయన కొన్నాళ్ళు పాల వ్యాపారం చేశారు. ఆతర్వాత ఓ మెకానిక్ షెడ్ నడిపారు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ ఆయన మిస్టర్ హైదరాబాద్‌గా ఏడుసార్లు అవార్డు అందుకున్నాడు ఇంతకూ ఆయన ఎవరంటే..

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇండస్ట్రీలో ఇప్పటికి ఆయన గురించి.. ఆయన మంచి తనం గురించి చెప్పుకుంటుంటారు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి.. అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు ‘ధర్మక్షేత్రం’ చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు. శ్రీహరి దాదాపు 100 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

శ్రీహరి నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రల్లో నటించారు శ్రీహరి. మగధీర సినిమాలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి. షేర్ ఖాన్ పాత్ర‌లో త‌న గంభీర‌మైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశారు. శ్రీహ‌రి హీరోగా న‌టించిన కుబుసం, భ‌ద్రాచ‌లం సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేశేవారో తెలుసా.? జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాగా సినిమాల్లోకి రాక ముందు ‘మిస్టర్ హైదరాబాద్ గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

శ్రీహరి ఫ్యామిలీ సినిమాల్లోకి రాక ముందు పాల వ్యాపారం చేశారు. హైదరాబాద్ లో శ్రీహ‌రి కుటుంబం పాల బిజినెస్ అలాగే మెకానిక్ షెడ్ ద్వారా జీవనం సాగించేవారు. శ్రీహరి కూడా మెకానిక్ షెడ్ లో పని చేశారు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు అదే థియేటర్ లో చూసేవాడు. శ్రీహరి ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్న స‌మ‌యంలో దాస‌రి గుర్తించి బ్ర‌హ్మ‌నాయుడు సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. ఆతర్వాత ఆయన విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. శ్రీహరి హీరోగా చేసిన మొదటి చిత్రం ‘పోలీస్’ అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం ‘పోలీస్ గేమ్’ కావడం విశేషం. అనారోగ్య సమస్యలతో అక్టోబరు 9, 2013 న ముంబై లో శ్రీహరి కన్నుమూసారు.Srihari

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..