నేను లేకుండా ఎలా చేస్తావో చూస్తానన్న హీరో.. ఒక్కసాంగ్‌తో ఇండస్ట్రీ షేక్ చేసిన కృష్ణారెడ్డి
టాలీవుడ్ లో తన సినిమాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణ రెడ్డి. కేవలం దర్శకుడిగానే కాదు. నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రతిభను చాటుకున్నారు. ఒకప్పుడు ఎస్వీ కృష్ణ రెడ్డి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కట్టేవారు. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు ఈ స్టార్ డైరెక్టర్

ఎస్.వీ కృష్ణారెడ్డి.. తెలుగు సినిమా చరిత్రలో మల్టీటాలెంటెడ్ డైరెక్టర్స్‌లో కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు కృష్ణారెడ్డి. ఫ్యామిలీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అలీతో యమలీలలాంటి సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఎస్.వీ కృష్ణారెడ్డి. ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే కృష్ణ రెడ్డి నుంచి వచ్చిన సినిమాల్లో మాయలోడు సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. అలాగే రాజేంద్రప్రసాద్ సరసన సౌందర్య హీరోయిన్‌గా నటించింది. మాయలోడు సినిమాలోని “చినుకు చినుకు సాంగ్” ఎంత పెద్ద సేసనేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కసాంగ్ కోసమే సినిమాకు వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఈ సాంగ్ కారణంగా సినిమా 365 రోజులు ఆడిందని బాబూమోహన్ గతంలో తెలిపారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ, సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించారు కృష్ణ రెడ్డి.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
అయితే మాయలోడు సినిమాలో చినుకు చినుకు సాంగ్ బాబు మోహన్ సౌందర్య మధ్య వస్తుంది. అంత సూపర్ హిట్ సాంగ్ హీరో, హీరోయిన్ మధ్య కాకుండా కమెడియన్, హీరోయిన్ మధ్య పెట్టడం సాహసమనే చెప్పాలి. గతంలో ఈ సాంగ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు కృష్ణ రెడ్డి.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
ఈ సాంగ్ విషయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టడంతోనే బాబూ మోహన్ తో చేయాల్సి వచ్చిందని తెలిపారు కృష్ణ రెడ్డి. ‘నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..’ అని నాపై సెటైర్లు వేశారు అని తెలిపారు. దాంతో నాకు కొంచం బాధగా అనిపించింది. అలాగే మాయలోడు సినిమా లాస్ట్ స్టేజ్ కు వచ్చిన సమయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. ఆయన డేట్స్ తక్కువగా ఇవ్వడంతో ఇంకొన్ని డేట్స్ ఇవ్వమని అడిగితే ఆయన సహకరించలేదు. బ్రతిమిలాడుకున్నా కూడా ఆయన వినలేదు. చివరకు ఆయనతో మిగిలిన డేట్స్ లో డబ్బింగ్ పూర్తి చేశాం.. అయినా ఒక్క సాంగ్ మిగిలిందిగా ఎలా చేస్తావో చూస్తా అన్నారు. సాంగ్ షూటింగ్ కు రండి అని పిలిస్తే.. “నేను రాను.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావ్‌గా ఎలా చేస్తావో చేసుకో పో” అన్నారు అని తెలిపారు కృష్ణ రెడ్డి. దాంతో ఆ పాటను బాబూమోహన్ తో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాను. అది తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ కొంతమందిని నా దగ్గరకు పంపించి సాంగ్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు అని చెప్పించారు. లేదు నేను బాబూమోహన్ కు మాటిచ్చాను.. కావాలంటే షూటింగ్ స్పాట్ కు వచ్చి సాంగ్ చూడొచ్చు అని చెప్పను అని అన్నారు కృష్ణ రెడ్డి. అయితే తాను ఇండస్ట్రీలో ఎదగడానికి రాజేంద్రప్రసాద్ సహకారం ఎంతో ఉంది అని అన్నారు కృష్ణారెడ్డి. కానీ ఈ ఒక్క సినిమా సమయంలోనే నన్ను బాధపెట్టారు అని చెప్పుకొచ్చారు ఎస్.వీ కృష్ణ రెడ్డి.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








