Kingdom Movie: థియేటర్‌లో కింగ్‌డమ్ సినిమాను చూసిన రాజమౌళి.. ఫొటోస్ వైరల్.. విజయ్ మూవీ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా గురువారం (జులై 31) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సినీ ప్రముఖుల కూడా ఈ మూవీని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

అనుకున్నట్లే విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.ఆ ఏడుకొండల స్వామి దయతో బిగ్ హిట్ సొంతం చేసుకున్నాడు. విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా కింగ్ డమ్ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. గురువారం రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా రూ.39 కోట్ల కలెక్షన్లు రాబట్టిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కింగ్ డమ్ సినిమాను వీక్షిస్తున్నారు. మూవీపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, మంచు విష్ణు, నాని తదితర స్టార్ సెలబ్రిటీలు కింగ్ డమ్ యూనిట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కింగ్ డమ్ సినిమాను వీక్షించారు. శుక్రవారం (ఆగస్టు 01) హైదరాబాద్‌లోని అపర్ణా సినిమాస్ థియేటర్‌కు తన కుటుంబంతో కలిసి వచ్చిన రాజమౌళి సాధారణ ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమాను చూసి ఎంజాయ్ చేశారు. ఈ సందర్బంగా అపర్ణా సినిమాస్ థియేటర్ వద్ద రాజమౌళిని చూసిన అభిమానులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ప్రస్తుతం రాజమౌళికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
అపర్ణా థియేటర్ లో రాజమౌళి..
The best always chooses the best ⭐
ఇవి కూడా చదవండిThe pride of Indian Cinema @ssrajamouli Garu was at #AparnaCinemas to watch #Kingdom ❤🔥@AparnaCinemas#LuxuryMeetsCinema #SSRajamouli pic.twitter.com/QfIhWsUMb9
— AparnaCinemas (@AparnaCinemas) August 1, 2025
నాన్ హాలీడే లోనూ 40 కోట్ల కు చేరువగా..
The King of Openings is back and how 🔥 With a Non holiday Thursday release – @TheDeverakonda has created wonders 🤙🏻#Kingdom pic.twitter.com/MGeRzzElV6
— KINGDOM (@KINGDOM_Offl) August 1, 2025
కింగ్ డమ్ సినిమా విషయానికి వస్తే.. మళ్లీరావా, జెర్సీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్న నూరి ఈ మూవీని తెరకెక్కించాఉ. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ తో పాటు మలయాళ నటుడు వెకంటేష్ మరో కీలక పాత్రలో మెరిశారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ కింగ్ డమ్ సినిమాను నిర్మించారు.అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








