AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ఒకప్పుడు బ్యూటీ పార్లర్‌లో పని చేసింది.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతోంది.. బిగ్‌బాస్ 10లోకి కూడా..

చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె బ్యూటీ పార్లర్ లో పని చేసి తన కుటుంబాన్ని పోషించుకుంది. ఇదే క్రమంలో జబర్దస్త్ లోకి అడుగు పెట్టి తన జీవితాన్ని మార్చుకుంది. ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల జాబితాలో ఈ జబర్దస్త్ కమెడియన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది.

Jabardasth: ఒకప్పుడు బ్యూటీ పార్లర్‌లో పని చేసింది.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతోంది.. బిగ్‌బాస్ 10లోకి కూడా..
Jabardasth Actress
Basha Shek
|

Updated on: Jul 06, 2026 | 7:59 PM

Share

2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్స్, టీమ్ లీడర్లుగా పనిచేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ.. ఇలా ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులు ఇప్పుడు ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. అయితే వీరంతా జబర్దస్త్ కు రాక ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే చేతి కొచ్చిన పనులు, ఉద్యోగాలు చేశారు. ఈ లేడీ కమెడియన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కెరీర్ ప్రారంభంలో పొట్ట కూటి కోసం బ్యూటీ పార్లర్ లో పని చేసిన ఈ నటి ఇప్పుడు తన యాక్టింగ్ తో జబర్దస్త్ లో దుమ్ము రేపుతోంది. అంతేకాదు త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి కూడా ఈ లేడీ కమెడియన్ కంటెస్టెంట్ గా వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?

జబర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పవిత్ర కూడా ఒకరు. మొదట టిక్‌టాక్‌ వీడియోలు చేసుకునే ఆమె జబర్దస్త్‌లోకి వచ్చాక బాగా పాపులరైంది. బుల్లెట్‌ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్‌ లో కంటెస్టెంట్ గా నవ్వుల పువ్వులు పూయించింది. కేవలం జబర్దస్త్ ఒక్కటే కాదు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోల్లోనూ సందడి చేస్తోంది పవిత్ర. స్క్రీన్ పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే పవిత్ర జీవితంలో ఎవరికీ కనిపించని కన్నీటి గాథలున్నాయి. కెరీర్ ప్రారంభంలో ఆమె బ్యూటీ సెలూన్ లో పనిచేసింది. అయితే జబర్దస్త్ తో క్రేజ్ వచ్చాక తనకు ఉన్న బ్యూటీ సెలూన్ ను అమ్మేసి ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేసింది. కాగా ఈ పవిత్ర క్రేజ్ దృష్ట్యా త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ ఈ అమ్మడు కనిపించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ పవిత్ర రీసెంట్ ఫొటోస్, వీడియోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒకప్పుడు పార్లర్‌లో పని చేసింది.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లోకి..
ఒకప్పుడు పార్లర్‌లో పని చేసింది.. ఇప్పుడు బిగ్‌బాస్ 10లోకి..
రుచి.. ఆరోగ్యం.. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ లడ్డు..
రుచి.. ఆరోగ్యం.. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ లడ్డు..
పురుషులు, మహిళలు కలిపి ఏకంగా 24 ఐసీసీ ట్రోఫీలతో రికార్డు
పురుషులు, మహిళలు కలిపి ఏకంగా 24 ఐసీసీ ట్రోఫీలతో రికార్డు
ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట..
ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట..
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్..
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్..
కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలే పణం..! బస్సులు ఆగక ట్రాక్టర్లపై..
కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలే పణం..! బస్సులు ఆగక ట్రాక్టర్లపై..
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మార్పులు.. కొత్త రూల్స్ వచ్చేశాయి..
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మార్పులు.. కొత్త రూల్స్ వచ్చేశాయి..
అయ్‌.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం
అయ్‌.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ?
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ?
మరో పతిదేవుడు బలి.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య
మరో పతిదేవుడు బలి.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య