AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: ఆమిర్ ఖాన్- గౌరీల వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్- గౌరీల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Aamir Khan: ఆమిర్ ఖాన్- గౌరీల వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
Aamir Khan Mariage
Basha Shek
|

Updated on: Jul 05, 2026 | 4:50 PM

Share

బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించారు. ఆదివారం (జులై 05) ముంబైలోని ఆమిర్ ఖాన్ నివాసంలోనే సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. సరిగ్గా మధ్యాహ్నం 12.45 గంటలకు ఇద్దరూ మ్యారేజ్ పేపర్లపై సంతకాలు చేశారు. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్- గౌరీల పెళ్లి వేడకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే నేపథ్యంలో ఆమిర్ ఖాన్ మూడో భార్య గౌరీ ఎవరు? ఆమె నేపథ్యమేంటి? ఆమిర్ తో ఎలా పరిచయం మొదలైంది? అన్నదానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ఆమిర్ ఖాన్ 1965వ సంవత్సరం మార్చి 14 జన్మించారు. అదేవిధంగా, గౌరి 1978న ఆగస్టు 21 జన్మించింది. అంటే ఇద్దరి మధ్య దాదాపు 14 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందన్న మాట. ఇక గౌరీ నేపథ్యం విషయానికి వస్తే.. బెంగళూరుకు చెందిన గౌరీ, స్టైలిస్ట్‌గా మంచి గుర్తింపు పొందిన రీటా స్ప్రాట్ కుమార్తె. తల్లి తమిళియన్ కాగా, తండ్రి ఐరిష్‌. బ్లూ మౌంటెన్ స్కూల్ లో‌ చదువుకున్న గౌరీ, ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్‌ కోర్సు చేసింది. ఆ తర్వాత లండన్ యూనివర్సిటీలో స్టైలింగ్, ఫోటోగ్రఫీ కోర్సు కంప్లీట్ చేసింది. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌లకు గత 25 ఏళ్లుగా పరిచయం ఉంది.  25 ఏళ్ల క్రితం వాళ్లిద్దరూ స్నేహితులు. కానీ గౌరీ చదువు కోసం లండన్ వెళ్లగా, ఆమిర్ ఖాన్ సినిమాలతో బిజీ అయిపోయారు. దీంతో  వాళ్లిద్దరూ ఒకరినొకరు మర్చిపోయారు. అయితే ఇటీవల, ఆమిర్ ఖాన్ బంధువు నుజత్ ఖాన్ ద్వారా వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు. దాంతో వారి పాత స్నేహం మళ్లీ చిగురించింది. ఆ తర్వాత అది ప్రేమగా చిగురించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాళ్లిద్దరూ వివాహం చేసుకుని భార్యాభర్తలు అయ్యారు.

ఇవి కూడా చదవండి

గతంలో గౌరీకి ఐర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తితో పెళ్లయింది. అయితే ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇక ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో కూడా చాలా ఏళ్లుగా పని చేస్తోంది గౌరీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..