AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు.. మెనూ ఇదే

బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' ఆమిర్ ఖాన్ మూడవసారి పెళ్లి చేసుకోబోతున్నారు. జూలై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నారు ఆమిర్. ఈ వివాహ వేడుకకు 150 మంది అతిథులు హాజరుకానున్నారు. వారి కోసం స్వయంగా ఆమిర్ ఖాన్ ప్రత్యేక వంటకాలు సిద్దం చేయనున్నారు.

Aamir Khan: ప్రియురాలితో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథుల కోసం పసందైన వంటకాలు..  మెనూ ఇదే
Aamir Khan, Gauri Spratt wedding
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 10:29 PM

Share

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో మూడవసారి పెళ్లి చేసుకోబోతున్నారు. తన ప్రియురాలు అయిన గౌరీ స్ప్రాట్‌ ను ఆయన తన జీవిత భాగస్వామిగా మార్చుకోనున్నారు. జూలై 5న ముంబైలోని తన నివాసంలో చాలా నిరాడంబరంగా, ప్రైవేట్‌గా జరిగే వేడుకలో వివాహం చేసుకోబోతున్నట్లు ఆమిర్ స్వయంగా తెలియజేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ పెళ్లి రిజిష్టర్ మ్యారేజ్ అయినప్పటికీ ఈ వేడుకకు ఇరు కుటుంబాల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు హాజరవుతారు. వివాహం అనంతరం అతిథుల కోసం ప్రత్యేక భోజనం ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అతిథుల కోసం ఆమిర్, గౌరీలే స్వయంగా వంటకాల మెనూను సిద్ధం చేశారు. ఈ వివాహ వేడుకకు సుమారు 100 నుంచి 150 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమిర్ పిల్లలు ఐరా, జునైద్, ఆజాద్‌తో పాటు గౌరీ కుమారుడు కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. అలాగే దర్శకులు అశుతోష్ గోవారికర్, రాజ్‌కుమార్ సంతోషిలతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు సన్నిహితులు కూడా ఆమిర్ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది.

ఇటీవల, రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ ప్రీమియర్‌లో ఆమిర్ తన వివాహం గురించి అధికారికంగా ప్రకటించారు. ఆయన తన కుమారుడు జునైద్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. . “మా పెళ్లి జూలై 5న జరగనుంది. మేము ఇంట్లోనే వివాహం చేసుకోబోతున్నాం. ఈ వేడుక చాలా ప్రైవేట్‌గా, సన్నిహితుల సమక్షంలో జరుగుతుంది. మా సంతోషానికి అందరి ఆశీస్సులు కావాలి. మా ముందున్న ఈ అందమైన ప్రయాణం కోసం మేము ప్రార్థిస్తున్నాము. ఇది పూర్తిగా ప్రైవేట్, మా ఇంట్లోనే జరిగే వేడుక,” అని ఆమిర్ మీడియాతో చెప్పుకొచ్చారు.

ఆమిర్ ఖాన్‌కు ఇది మూడవ వివాహం. ఆయనకు ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగింది. 1986లో ఆమిర్, రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వారికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, 2002లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత, ఆమిర్ ఖాన్ కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. వారికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు, కానీ వారి వివాహ బంధం 2021లో ముగిసింది. ఇప్పుడు గౌరీతో ముచ్చటగా మూడోసారి పెళ్లిపీటలెక్కనున్నాడు ఆమిర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us