AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Durga: బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా.. షాకింగ్ విషయం చెప్పిన నాగదుర్గ

బిగ్ బాస్ వంటి రియాలిటీ షోల్లో పాల్గొనేందుకు చాలా మంది సెలబ్రిటీలు ఆసక్తి చూపిస్తుంటారు. డబ్బుకు డబ్బు, క్రేజ్ వస్తుందన్న కారణాలతో ఈ షోలో కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేసందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఫోక్ సింగర్ నాగదుర్గ మాత్రం ఓ కారణంతో బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట.

Naga Durga: బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా.. షాకింగ్ విషయం చెప్పిన నాగదుర్గ
Nagarjuna, Naga Durga
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 7:00 AM

Share

గత కొన్ని రోజులుగా నాగదుర్గ పేరు తెగ వినిపిస్తోంది. ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండడమే దీనికి కారణం. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాయితం. ఇందులో నాగ దుర్గ ‘శ్రీలత’ అనే తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేశాయి. దీనికి తోడు ఇడుపు కాయితం టైటిల్ పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీంతో మొత్తానికి ఈ వివాదాల మధ్యన నాగదుర్గు పేరు బాగా హైలెట్ అవుతోంది. కాగా ఇడుపు కాయితం ముందు పలు సినిమా అవకాశాలు వచ్చాయి నాగ దుర్గకు. అయితే నాట్యంపైనే ప్రధానంగా దృష్టి సారించాలన్న కారణంతో అన్నిటినీ రిజెక్ట్ చేసింది. నాగ దుర్గు రిజెక్ట్ చేసిన సినిమాల్లో నాని శ్యామ్ సింగరాయ్, పవన్ కల్యాణ్ బ్రో వంటి సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడికి బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చిందట. అయితే వెంటనే రిజెక్ట్ చేసిందట. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు హాజరైన నాగదుర్గ నాగదుర్గ తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌తో పాటు బిగ్‌బాస్ తెలుగు ఆఫర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘నిజం చెప్పాలంటే నాకెలాంటి భయం అనేది లేదు. కానీ నేను బిగ్ బాస్ షోకు సెట్ కాను అనిపించింది. అందుకే వెళ్లలేదు. అది నా నిర్ణయం. నేను చాలా సైలెంట్. చాలా మొహమాటస్తురాలిని. ఎవరికైనా ‘నో’ చెప్పాలన్నా నాకు చాలా భయం. నా ఫీలింగ్స్ కంటే ఎదుటివారి ఫీలింగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అయితే అదే కొన్ని సందర్భాల్లో నాకు సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు ఎదుటివారిని రిజెక్ట్ చేయలేక నేనే బాధపడుతూ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు అమ్మ నాతో ఒక మాట చెప్పింది. ‘నువ్వు చిన్న విషయానికే ఇంత ఎమోషనల్ అవుతావు. బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరిగితే ఎలా తట్టుకుంటావో ఒకసారి ఆలోచించు’ అని చెప్పింది. కానీ నాన్న మాత్రం బిగ్‌బాస్‌లో పాల్గొనాలని సూచించాడు. కనీసం రెండు మూడు వారాలు అయినా హౌస్‌లో ఉంటే చాలు. దాంతో టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతావు అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇడుపుకాయితం ఈవెంట్ లో నాగదుర్గ స్పీచ్..

‘అయితే ప్రస్తుతం నా ఫుల్ ఫోకస్ సినిమాలపైనే ఉంది. నేను హీరోయిన్‌గా మంచి అవకాశాలు అందుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒకేసారి రెండు పనులపై దృష్టి పెట్టి ఏదీ సరిగా చేయలేనని అనిపించింది. అందుకే బిగ్‌బాస్ ఆఫర్‌ను గౌరవంగా తిరస్కరించాను ‘ అని చెప్పుకొచ్చిందీ ఫోక్ సింగర్. ప్రస్తుతం నాగదుర్గ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
రో-కో కంటే డేంజరస్ అతను.. మావోళ్లకు బడితపూజే..!
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
పీడకలలు ఎందుకు వస్తాయి? శాస్త్రం చెప్పే అసలు కారణాలు, పరిహారాలు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
ఆయన గ్రేట్ హీరో.. మాటల్లో చెప్పలేని అద్భుతమైన నటుడు..
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
హర్భజన్‌కు శ్రీశాంత్‌ రూమ్‌మేట్‌గా కావాలట..! కారణం ఇదే!
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
వామ్మో ఎలా వస్తున్నాయ్ అక్కా ఈ ఐడియాలు.. భర్తను చంపి ఏం చేసిందంటే
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
లోన్ యాప్స్ వాడేవారికి కేంద్రం అలర్ట్.. అలా చేస్తే మీ పని ఖతమే..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా
ఒక్క సినిమాతో మారిపోయిన జాతకం.. మరో స్టార్ హీరో మూవీలో వామికా
ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..
ఆ ఒక్క పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా..
ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..
ఇంట్లో శంఖాన్ని ఏ దిక్కులో ఉంచాలి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..