AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

తెలంగాణ ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ నాగదుర్గ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతోన్న ఇడుపు కాయితం సినిమాలో కథానాయికగా కనిపించనుందీ అందాల తార. అయితే దీనికంటే ముందు నాగదుర్గకు పలువురి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి.

Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ
Naga Durga, Pawan Kalyan
Basha Shek
|

Updated on: Jul 01, 2026 | 10:15 PM

Share

నాగదుర్గ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోక్ సింగర్ పేరు తెగ మార్మోగుతోంది. ఇప్పటివరకు తన ఫోక్‌ సాంగ్స్, డ్యాన్సులతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగ దుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించిందీ బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో ధనుష్ మేనల్లుడి సరసన ‘లవ్‌ ఓ లవ్‌’ అనే సినిమా చేస్తోంది.. అయితే ఇప్పుడు హీరోయిన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనుంది నాగ దుర్గ. బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాయితం సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది నాగ దుర్గ. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దొండపాటి వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో నాగ దుర్గ ‘శ్రీలత’ అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు ఇడుపు కాయితం అనే టైటిల్ పై నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం, ఆమె పాటలు, డ్యాన్స్ లు, పాత ఇంటర్వ్యూలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా నాగదుర్గకు గతంలోనే పలు సినిమా ఛాన్స్ లు వచ్చాయి. అయితే వివిధ కారణాలతో వాటిని రిజెక్ట్ చేసింది. ‘హీరోయిన్‌గా నటించకముందే నాకు చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో సాయి పల్లవి పాత్రకు సహచరిగా క్లాసికల్ టచ్ ఉన్న ఓ ముఖ్యమైన పాత్ర కోసం నన్ను అడిగారు. అలాగే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ కోసం కూడా సంప్రదించారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆ సమయంలో నా ఫోకస్ పూర్తిగా నాట్యంపైనే ఉండేది. ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో డాక్టరేట్ సాధించాలన్నది నా కల. అందుకే సినిమాల్లోకి వెంటనే రావాలని అనుకోలేదు. నాట్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమా ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మంచి కథ, మంచి పాత్ర దొరికిందని భావించి సినిమాల్లోకి అడుగుపెట్టాను’ అని నాగదుర్గు చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌