AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. సీక్రెట్ లవ్ స్టోరీ బయట పెట్టిన టాలీవుడ్ హీరోయిన్

ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ఈ హీరోయిన్ తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తన లవ్ స్టోరీని కూడా బయట పెట్టింది.

Actress: అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. సీక్రెట్ లవ్ స్టోరీ బయట పెట్టిన టాలీవుడ్ హీరోయిన్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 7:20 AM

Share

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న తెలుగు హీరోయిన్లలో అంజలి ఒకరు. ఫొటో సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రయాణం షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో అంజలి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే గీతాంజలి, వకీల్ సాబ్, గేమ్ ఛేంజర్, మదగజరాజా సినిమాలు కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తోందీ అందాల తార. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళంలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది అంజలి. అందులో విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తనకు ఎదురైన లవ్ ప్రపోజల్స్ గురించి కూడా బయట పెట్టింది.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ‘ప్రపోజ్ చేస్తే రాఖీ ఎందుకు కట్టారు?’ అని ప్రశ్నించగా, ‘అది ఒక ఈగో డ్రైవ్’ అని అంజలి సమాధానమిచ్చింది. ‘కట్టి చూడు’ అంటూ అతను నాకు ఛాలెంజ్ చేశాడు. నేనూ తగ్గకుండా నిజంగానే రాఖీ కట్టేశాను. అంతే. నేను స్కూల్‌లో చదువుతున్న రోజుల్లోనే ఒక అబ్బాయి నన్ను ఇష్టపడేవాడు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు నిరంతరం నాకు ప్రపోజ్ చేస్తూనే ఉండేవాడు. మొదట్లో పట్టించుకోకపోయినా.. చివరకు అతని పట్టుదల చూసి ఓ నిర్ణయం తీసుకున్నాను. ‘పదో తరగతిలో అతనికి రాఖీ కట్టేశాను. ఇక ఆ తర్వాత నన్ను వదిలేస్తాడనుకున్నాను. కానీ అతను మాత్రం ‘అన్నయ్య కాదు… కన్నయ్య’ అంటూ రాఖీ తీసి పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతన్ని నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు’ అని అప్పటి క్షణాలను గుర్తకు తెచ్చుకుంది అంజలి.

ఇవి కూడా చదవండి

సినిమా ప్రమోషన్లలో అంజలి, విశాల్..

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

ఇక సినిమా పరిశ్రమలో వచ్చిన లవ్ ప్రపోజల్స్ గురించి మాట్లాడిన అంజలి అవన్నీ చాలా కామన్ విషయాలు అని పేర్కొంది. ‘ సినిమా షూటింగ్‌ల సమయంలో అభిమానులు, సహనటులు, పరిచయస్తుల నుంచి ఎమోషనల్‌గా ప్రపోజల్స్ వస్తుంటాయి. అయితే వాటిని నేను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతాయి. కానీ ప్రతి ప్రపోజల్ ప్రేమగా మారదు. చాలా వరకు అభిమానుల అభిమానం మాత్రమే ఉంటుంది’ అని క్లారిటీగా చెప్పింది అంజలి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
అతను ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. ఎప్పుడు ప్రారంభం?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
అరటిపండు vs ఖర్జూరం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏది తింటే మంచిది?
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది.. ఆ కారణంతో రిజెక్ట్ చేశా: నాగదుర్గ
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
ఒడిశా నుంచి బెంగళూరుకు సైకిల్‌పై వచ్చిన హార్దిక్ పాండ్యా ఫ్యాన్
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసా?
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..