AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్.. సినిమాల పిచ్చితో సైకోలా మారే హీరో.. తెలుగులోనూ చూడొచ్చు

ఈ మలయాళం సినిమా కొద్ది రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. అక్కడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఐఎమ్ డీబీలో పదికి 7.4 రేటింగ్ ఉన్న ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్.. సినిమాల పిచ్చితో సైకోలా మారే హీరో.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 04, 2026 | 10:00 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అబ్సెషన్, మాలీవుడ్ టైమ్స్, హ్యాంగ్ మ్యాన్ వంటి సినిమాలతో పాటు సూపర్ సుబ్బు, ఇసకపట్నం, మర్మదేశం వంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు రెండు మలయాళం సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఒకటి కరక్కం మూవీ కాగా మరొకటి ప్రేమలు హీరో నస్లేన్ నటించిన డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఆసక్తికరమైన కథా కథనాలతో మాలీవుడ్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి గానే వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. స్పీల్ బర్గ్, ఆర్జీవీ దర్శకుల స్ఫూర్తితో సినిమా ఇండస్ట్రీలో రాణించాలనుకుంటాడు హీరో నస్లేన్. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ గా ఒక మంచి అవకాశం వస్తుంది. తన మొదటి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తాడు. అయితే ఇంతలోనే ట్విస్ట్.. తన కథను వేరే వ్యక్తి సినిమాగా ముందే తీస్తాడు. దీంతో అతను మానవత్వం, జాలి అన్నీ వదిలేసి సైకోలా మారిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

నస్లేన్ నటించిన ఈ సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ పేరు మాలీవుడ్ టైమ్స్. అభినవ్ సుందర్ నాయక్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్, షరాఫ్ ఉద్దీన్, సంగీత్ ప్రతాప్, రోషన్ షానవాస్, రాజేష్ మాధవన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాము సునీల్, అభినవ్ సుందర్ నాయక్ కలిసి ఈ సినిమాకు కథను అందించారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ‘మాలీవుడ్ టైమ్స్’ సినిమా ప్రముఖ ఓటీటీ ‘జియో హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోఈ మూవీ అందుబాటులో ఉంది. దీంతో పాటే ‘సింప్లీ సౌత్’ ఓటీటీలోనూ మాలీవుడ్ టైమ్స్ స్ట్రీమింగ్ అవుతోంది.

జియో హాట్ స్టార్ లో మాలీవుడ్ టైమ్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us