Ram Charan: రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్! వద్దు బాబోయ్ అంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణమిదే
రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. RC 17 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తోన్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, తన తదుపరి సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న సంగతి తెలిసిందే. RC 17 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రంగస్థలం అనే బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా వస్తుండడంతో మెగాభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని కథానాయికగా ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు కూడా సమాచారం.
అయితే ఇప్పుడు ఈ వార్త బయటకు పొక్కడంతో మెగాభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ బ్లాక్ బస్టర్ కాంబోలో ఈ హీరోయిన్ ఎందుకని తలలు పట్టుకుంటున్నారు. అభిమానులు ఇలా అనుకోవడానికి బలమైన కారణం లేకపోలేదు. ఎందుకంటే.. రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’.. అలాగే శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’.. ఈ రెండు సినిమాల్లోనూ కియారానే హీరోయిన్ గా చేసింది. విచిత్రమేమిటంటే.. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. దీంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోన్న కియారా అద్వానీ రామ్ చరణ్ కు అచ్చిరాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే RC 17 ప్రాజెక్ట్ లోకి ఆమెను వద్దంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈ సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నారన్నది కేవలం రూమర్ మాత్రమే. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




