AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ లడ్డు.. దీనికి మించింది ఏం లేదు..

రాగిపిండి, బెల్లం, కొబ్బరి, నెయ్యితో తయారుచేసే రాగి లడ్డూలు రుచికరమైనవే కాకుండా పోషకాలతో నిండి ఉంటాయి. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండటంతో ఎముకల ఆరోగ్యం, శక్తి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపోయే ఈ ఆరోగ్యకరమైన తీపి వంటకాన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ లడ్డు.. దీనికి మించింది ఏం లేదు..
Ragi Laddu Recipe
Shaik Madar Saheb
|

Updated on: Jul 06, 2026 | 7:53 PM

Share

రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. నిపుణుల ప్రకారం.. రాగులు (ఫింగర్ మిల్లెట్) అత్యంత పోషకమైన చిరుధాన్యాలు. 100 గ్రాముల రాగులలో సుమారు 344 మి.గ్రా కాల్షియం, 11.2 గ్రాముల డైటరీ ఫైబర్, 7.3 గ్రాముల ప్రొటీన్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. ఇంకా బరువు తగ్గడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. రాగులను ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొంటారు.. వాస్తవానికి మన పూర్వీకులు రాగులను బాగా తినేవారు.. అందుకే, గట్టిగా ధృఢంగా ఉండేవారు. అయితే.. రాగిపిండితో ఎన్నో పదార్థాలను చేసుకుని తినొచ్చు.. ముఖ్యంగా రాగిపిండితో చేసే లడ్డూలు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే, ఆరోగ్యకరమైన తీపి వంటకం. ఈ రెసిపీ, రాగిపిండిని సులభంగా, రుచికరంగా ఎలా వాడుకోవాలో తెలియజేస్తుంది. రాగిపిండిలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని బెల్లంతో కలిపి లడ్డూలుగా చేయడం వల్ల ఆరోగ్యం, రుచి రెండూ సమకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.

కావలసిన పదార్థాలు:

  • రాగిపిండి: 1.5 కప్పులు
  • సూజీ రవ్వ (బొంబాయి రవ్వ): 0.5 కప్పు (రవ్వ వద్దు అనుకుంటే మొత్తం 2 కప్పుల రాగిపిండి తీసుకోవచ్చు)
  • నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు (సుమారు 1/4 కప్పు)
  • ఎండుకొబ్బరి తురుము: 0.5 కప్పు
  • తురిమిన బెల్లం: 1 కప్పు
  • జీడిపప్పులు: కొన్ని
  • యాలకులు: 4-5
  • కాచి చల్లార్చిన పాలు: 0.5 కప్పు (లడ్డూలు చుట్టడానికి)

తయారీ విధానం:

పిండి వేయించుకోవడం: ముందుగా ఒక మందపాటి పాన్‌లో 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగాక, అందులో ఒకటిన్నర కప్పుల రాగిపిండి, అర కప్పు సూజీ రవ్వ వేయాలి. రవ్వ ఇష్టం లేని వారు మొత్తం రెండు కప్పుల రాగిపిండిని ఉపయోగించవచ్చు.

నెమ్మదిగా వేయించాలి: మంటను పూర్తిగా తగ్గించి (లో ఫ్లేమ్), పిండిని నిరంతరం కలుపుతూ వేయించుకోవాలి. మంటను హైలో లేదా మీడియంలో పెట్టకూడదు. పిండి కమ్మటి వాసన వచ్చి, రంగు కొద్దిగా మారే వరకు సుమారు 10 నిమిషాల పాటు వేయించాలి. పిండి ఎంత బాగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి.

కొబ్బరి కలుపుకోవడం: సుమారు 8 నిమిషాల తర్వాత, పిండి దాదాపుగా వేగినప్పుడు, అర కప్పు ఎండుకొబ్బరి తురుమును వేసి, మరో 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. కొబ్బరిని చివర్లో వేయడం వల్ల అది మాడకుండా ఉంటుంది, సులభంగా వేగుతుంది.

బెల్లం కలపడం: పిండి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పాన్‌లోనే ఒక కప్పు తురిమిన బెల్లం వేయాలి. రెండు కప్పుల పిండి మిశ్రమానికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది. బెల్లం వీలైనంత మెత్తగా తురుముకోవడం వల్ల వేడికి త్వరగా కరిగిపోతుంది. మిశ్రమాన్ని బాగా కలిపి, మూత పెట్టి పక్కన ఉంచాలి.

జీడిపప్పులు, యాలకులు: మరొక చిన్న పాన్‌లో మిగిలిన 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేడి చేసి, జీడిపప్పులను గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించాలి. వేయించిన జీడిపప్పులను నెయ్యితో సహా రాగిపిండి మిశ్రమంలో వేయాలి. మంచి సువాసన కోసం నాలుగైదు యాలకులను దంచి అందులో కలపాలి.

మిశ్రమాన్ని కలపడం: మిశ్రమం వేడిగా ఉన్నప్పుడు మొదట స్పూన్‌తో కలిపి, అది చేత్తో పట్టుకునేంత వేడికి వచ్చిన తర్వాత, చేతులతో బాగా కలపాలి. బెల్లం గడ్డలు ఉంటే నలుపుతూ కలపాలి, అప్పుడు బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది.

లడ్డూలు చుట్టడం: అర కప్పు కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా (ఒక్కో స్పూన్ చొప్పున) మిశ్రమంలో వేసుకుంటూ కలపాలి. పాలు మొత్తం ఒకేసారి పోయకూడదు. మిశ్రమం లడ్డూలు చుట్టడానికి వీలైనంత మెత్తగా తయారైనప్పుడు, కావలసిన పరిమాణంలో లడ్డూలను చుట్టుకోవాలి. పాలకు బదులుగా కరిగించిన నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. నెయ్యితో చేసిన లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి (దాదాపు 5 రోజుల వరకు పాలు ఉపయోగించిన లడ్డూలు ఫ్రెష్‌గా ఉంటాయి).

ఈ రాగి లడ్డూలు మృదువుగా, రుచికరంగా ఉంటాయి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు మధ్యమధ్యలో తగులుతూ అదనపు రుచిని అందిస్తాయి. బెల్లంతో చేయడం వల్ల ఇవి ఆరోగ్యకరమైన స్నాక్‌గా ఉపయోగపడతాయి. ఈ రుచికరమైన, పోషకమైన రాగి లడ్డూలను మీరూ ప్రయత్నించి చూడండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రుచి.. ఆరోగ్యం.. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ లడ్డు..
రుచి.. ఆరోగ్యం.. శరీరానికి పుష్టినిచ్చే పర్ఫెక్ట్ లడ్డు..
పురుషులు, మహిళలు కలిపి ఏకంగా 24 ఐసీసీ ట్రోఫీలతో రికార్డు
పురుషులు, మహిళలు కలిపి ఏకంగా 24 ఐసీసీ ట్రోఫీలతో రికార్డు
ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట..
ఆరు తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇల్లు.. ఒకే వంట..
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్..
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్..
కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలే పణం..! బస్సులు ఆగక ట్రాక్టర్లపై..
కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలే పణం..! బస్సులు ఆగక ట్రాక్టర్లపై..
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మార్పులు.. కొత్త రూల్స్ వచ్చేశాయి..
ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మార్పులు.. కొత్త రూల్స్ వచ్చేశాయి..
అయ్‌.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం
అయ్‌.. బాబోయ్ అడుగడుగునా పాములే.. జనాల్లో భయం భయం
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ?
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ?
మరో పతిదేవుడు బలి.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య
మరో పతిదేవుడు బలి.. భర్త నరాల్లోకి హార్పిక్‌ ఎక్కించి హత్య
హైదరాబాద్–శ్రీశైలం–యాదాద్రి దర్శనం.. 4 రోజుల అద్భుత టూర్ ప్యాకేజీ
హైదరాబాద్–శ్రీశైలం–యాదాద్రి దర్శనం.. 4 రోజుల అద్భుత టూర్ ప్యాకేజీ