లక్కీ ఛాన్స్ కొట్టిన రాశి సింగ్.. ఇక ముద్దుగుమ్మ లైఫ్ సెట్
04-07-2026
Pic credit - Instagram
Phani Ch
రాశి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్‌కి ఇటీవల ఎంట్రీ ఇచ్చిన కొత్త హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు.
రాశి సింగ్ మొట్టమొదట “జెమ్” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుండి సీరియల్స్ చూసి యాక్టర్ కావాలని ఆసక్తి కలిగిందట.
ఈ ముద్దుగుమ్మ 14 ఏళ్ల వయసులో ఓ కమర్షియల్ యాడ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ మొదటి లో ఎయిర్ హోస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది.
ఆ తర్వాత హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటూ నటన మీద ఉన్న మక్కువతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రాశి సింగ్.
రాశీ సింగ్ లో జెమ్, పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్ వంటి సినిమాల్లో అలరించింది. ఈ మధ్య కాలంలో భూతద్దం భాస్కర్ నారాయణ నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమాలో వడ్డే నవీన్ సరసన నటించి, అందరిని మెప్పించారు రాశి సింగ్. అయితే ఈ ముద్దుగుమ్మకు నందమూరి బాలయ్య సినిమాలో అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.
బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా వస్తోంది. ఈ మూవీలో రాశి సింగ్ కు స్పెషల్ రోల్ దక్కిందట. ఓ కీలక పాత్ర కోసం రాశి సింగ్ ను చిత్ర బృందం సంప్రదింపులు చేసినట్లు టాక్ నడుస్తోంది.