AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australia Cricket : వరల్డ్ క్రికెట్ బాస్ ఆస్ట్రేలియా.. పురుషులు, మహిళలు కలిపి ఏకంగా 24 ఐసీసీ ట్రోఫీలతో రికార్డు

Australia Cricket : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన ఆస్ట్రేలియా మొత్తం 24 ఐసీసీ ట్రోఫీలతో ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసింది. పురుషులు, మహిళల జట్ల విజయాలతో ఆసీస్ రికార్డులు సృష్టించగా, భారత్ 9 ఐసీసీ ట్రోఫీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

Australia Cricket : వరల్డ్ క్రికెట్ బాస్ ఆస్ట్రేలియా.. పురుషులు, మహిళలు కలిపి ఏకంగా 24 ఐసీసీ ట్రోఫీలతో రికార్డు
Australia Cricket
Rakesh
|

Updated on: Jul 06, 2026 | 7:51 PM

Share

Australia Cricket : ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టుకు ఉన్న క్రేజ్, సక్సెస్ రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ టోర్నమెంట్లు వచ్చాయంటే చాలు ఆసీస్ ప్లేయర్లు సింహాల్లా విరుచుకుపడుతుంటారు. తాజాగా ముగిసిన 2026 మహిళల టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఖాతాలో సరికొత్త మైలురాయి చేరింది. పురుషుల, మహిళల జట్లను కలిపి ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఏకంగా 24 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుని ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ రేసులో భారత్ 9 ట్రోఫీలతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఆసీస్ సాధించిన రికార్డుకు, మనకు మధ్య రెట్టింపు కంటే ఎక్కువ వ్యత్యాసం ఉండటం గమనార్హం.

లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు ఇంగ్లాండ్‌ను 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మహిళలు కేవలం 17.1 ఓవర్లలోనే ఛేదించి ఏడోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు మొత్తం ఐసీసీ ట్రోఫీల సంఖ్య 14కు చేరింది. ఆస్ట్రేలియా పురుషుల జట్టు కూడా తక్కువ ఏమీ తినలేదు, వారు ఇప్పటివరకు 10 ఐసీసీ టైటిళ్లను గెలిచారు. ఈ విధంగా రెండు విభాగాల్లోనూ ఆసీస్ జట్లే ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఐసీసీ ట్రోఫీలు (పురుషులు, మహిళలు కలిపి) గెలిచిన దేశాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా ఎంత పటిష్టమైన స్థితిలో ఉందో అర్థమవుతుంది. ఆస్ట్రేలియా 24 ట్రోఫీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా, టీమిండియా 9 ట్రోఫీలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 8 ట్రోఫీలతో మూడో స్థానంలో ఉండగా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్లు చెరో 4 ఐసీసీ ట్రోఫీలతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఫామ్, ట్రాక్ రికార్డ్ చూస్తుంటే భవిష్యత్తులో ఏ జట్టుకైనా ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ఆస్ట్రేలియా సాధించిన ఈ 24 ఐసీసీ ట్రోఫీల ప్రస్థానం చాలా అద్భుతమైనది. ఆసీస్ మహిళల జట్టు ఏకంగా 7 సార్లు వన్డే వరల్డ్ కప్ (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022), 7 సార్లు టీ20 వరల్డ్ కప్ (2010, 2012, 2014, 2018, 2020, 2023, 2026) గెలుచుకుంది. ఇక ఆసీస్ పురుషుల జట్టు 6 సార్లు వన్డే వరల్డ్ కప్ (1987, 1999, 2003, 2007, 2015, 2023), 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ (2006, 2009), ఒకసారి టీ20 వరల్డ్ కప్ (2021), ఒకసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2021-2023) టైటిళ్లను కైవసం చేసుకుని మెగా టోర్నీల కింగ్‌గా నిలిచింది.

మన భారత క్రికెట్ జట్టు కూడా ఐసీసీ టోర్నీలలో పలుమార్లు అద్భుత విజయాలను నమోదు చేసింది. టీమిండియా పురుషుల జట్టు 3 సార్లు టీ20 వరల్డ్ కప్ (2007, 2024, 2026), 2 సార్లు వన్డే వరల్డ్ కప్ (1983, 2011), 3 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ (2002, 2013, 2025) గెలుచుకుని భారత అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. అలాగే భారత మహిళల జట్టు కూడా 2025 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుని దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us