ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి  భర్త రావాలి..

04-07-2026

Pic credit - Instagram

Phani Ch

అనన్య నాగళ్ల తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. ప్రియదర్శితో కలిసి మల్లేశం మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది.

మల్లేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్‌ సాబ్‌’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ చిన్న చిన్న అవకాశాలు మాత్రమే వచ్చాయి.. అవి కూడా అంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది

అయితే  ఇక ఇటీవల అనన్య నటించిన పొట్టేల్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన బుజ్జమ్మ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన మొదటి క్రష్ అని అనన్య వెల్లడించింది. తనకు కాబోయే లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలనే విషయంపై కూడా అనన్య క్లారిటీ ఇచ్చింది.