AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏంటి మేడమ్.. ఇది మీరేనా! మోడ్రన్ లుక్‌లో మెరిసిపోతున్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

ఒకప్పుడు తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. స్టార్ హీరోలందరితోనూ కలిసి సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. మధ్యలో కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చినా మళ్లీ ఇప్పుడు సహాయక నటిగానూ మెప్పిస్తోంది.

Tollywood: ఏంటి మేడమ్.. ఇది మీరేనా! మోడ్రన్ లుక్‌లో మెరిసిపోతున్న ఈ టాలీవుడ్  హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 05, 2026 | 5:23 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ తరం జనరేషన్ అయితే ఈ బ్యూటీని గుర్తు పట్టడం కొంచెం కష్టమే. పాత సినిమాలు బాగా చూసే వారైతే సులభంగా గుర్తు పట్టేసి ఉంటారు. అందులోనూ 1990-2000 జనరేషన్ ఆడియెన్స్ కు ఈ ముద్దుగుమ్మ బాగా పరిచయం. గతంలో తెలుగుతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తోంది. అదే క్రమంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, షోలు, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది. అంతేకాదు గ్లామరస్ ఫోటోషూట్స్‌తోనూ అలరిస్తుంటుంది. అలా తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొని అందుకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే క్షణాల్లో ఒక్కసారిగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఎక్కువగా చీర, పంజాబీ డ్రెస్సులో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం రిప్డ్ జీన్స్ (చిరిగిన) ప్యాంట్, వెరైటీ షర్ట్ ధరించి ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు? ఏంటి మేడమ్ ఇది మీరేనా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?

50 ఏళ్లు దాటినా 20 ఏళ్ల హీరోయిన్ లా కనిపిస్తోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు సిమ్రాన్. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లీ చేసుకుంది. దీపక్ బగ్గాతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కాగా ఇప్పుడు పిల్లలు బాగా పెద్దవడంతో మళ్లీ సినిమాలు చేస్తోంది సిమ్రాన్. సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది. గతేడాది శబ్దం, టూరిస్ట్ ఫ్యామిలీ, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సిమ్రాన్ ప్రస్తుతం రజనీకాంత్ ధర్మన్ సినిమాలో కనిపించనుంది. ఇప్పుడీ ఫొటో షూట్ కూడా రజనీ సినిమా కోసమే చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సిమ్రాన్ ఫొటోస్..

టీవీ షోలో హీరో ప్రశాంత్ తో కలిసి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us