AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రసవం తర్వాత బాలింతలు తినాల్సిన కరివేపాకు పొడి.. ఒకసారి చేస్తే 2 నెలలు నిల్వ ఉండే కమ్మని కారం

ప్రసవం తర్వాత బాలింతల ఆరోగ్యం కోసం పోషకాహారం చాలా ముఖ్యం. ఇనుము, కాల్షియం మరియు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండే కరివేపాకు కారం పొడి శరీరానికి బలం ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ సంప్రదాయ వంటకం ఒకసారి చేస్తే దాదాపు రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు..

Srilakshmi C
|

Updated on: Jul 06, 2026 | 7:10 PM

Share
ప్రసవం తర్వాత బాలింతల కోసం కరివేపాకు కారం పొడి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది నోటికి రుచిని మాత్రమేకాదు ఒంటికి శక్తిని ఇస్తుంది. దీని తయారీకి కావలసిన పదార్థాలు.. కరివేపాకు  4 కప్పులు (శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టినవి), ఎండు మిరపకాయలు – 20 నుండి 25, ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, ఉప్పు – తగినంత, నూనె 1 టీ స్పూన్ (ఐచ్ఛికం) తీసుకోవాలి.

1 / 5
ముందుగా కరివేపాకును బాగా కడగాలి. నీరు పూర్తిగా ఆరిపోయే వరకు గుడ్డపై లేదా జల్లెడలో పరచాలి. తడి ఉంటే పొడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మందపాటి కళాయిలో కరివేపాకు వేసి తక్కువ మంటపై వేయించాలి. ఆకులు పూర్తిగా కరకరలాడే వరకు వేయించాలి. మాడిపోకుండా తరచూ కలుపుతూ ఉండాలి. వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.

2 / 5
అదే పాన్‌లో ధనియాలు వేయించి సువాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత జీలకర్రను స్వల్పంగా వేయించాలి. ఎండు మిరపకాయలను కొద్దిగా నూనె వేసి వేయిస్తే మంచి రుచి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలను కూడా స్వల్పంగా వేయించుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్‌లో ముందుగా ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి పొడిచేయాలి. తరువాత వేయించిన కరివేపాకు, వెల్లుల్లి వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా దరదరలాడేలా చేస్తే రుచిగా ఉంటుంది.

3 / 5
ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. తేమ లేకుండా ఉంచితే 1–2 నెలల వరకు బాగా ఉంటుంది. అంతే కరివేపాకు కారం రెడీ అయినట్లే. వేడి అన్నంలో ఒక స్పూన్‌ కరివేపాకు కారం పొడి వేసుకుని అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి టిఫిన్స్‌తో కూడా తినవచ్చు.

4 / 5
కరివేపాకులో ఇనుము, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రసవం తర్వాత శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో ఇది సహాయపడుతుంది. అయితే బాలింతలు తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకుని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!