AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలే పణం..! బస్సులు ఆగక ట్రాక్టర్లపై వేలాడుతున్న విద్యార్థులు

మెదక్ జిల్లా చిట్కుల గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో కాలేజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినులు రోజూ రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుండగా, విద్యార్థులు ట్రాక్టర్లపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. స్థానికులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.

కాలేజీకి వెళ్లాలంటే ప్రాణాలే పణం..! బస్సులు ఆగక ట్రాక్టర్లపై వేలాడుతున్న విద్యార్థులు
Chitkul Village Students
P Shivteja
| Edited By: |

Updated on: Jul 06, 2026 | 7:45 PM

Share

చదువుకోవాలన్న వారి ఆశకు.. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. నిత్యం కాలేజీకి వెళ్లి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆ విద్యార్థులు.. రోడ్లపై కిలోమీటర్ల మేర నడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. ప్రమాదకరంగా ట్రాక్టర్లపై వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిలిపిచేడు మండల పరిధిలోని చిట్కుల గ్రామంలో నిత్యం కనిపిస్తున్న దైన్య స్థితి ఇది. చిట్కుల గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు.. ఉన్నత చదువుల కోసం నిత్యం జోగిపేట కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆ రూట్లో వెళ్లే ఆర్టీసీ బస్సులు ఫుల్ అయి వస్తున్నాయని, చిట్కుల గ్రామం వద్ద అసలు ఆపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థినులు రోజూ చిట్కుల గ్రామం నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన రావాల్సి వస్తోంది.

గత నాలుగు రోజులుగా ఇదే దుస్థితి కొనసాగుతోందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాలేజీకి సమయం దాటిపోతుండటం.. మరోవైపు బస్సులు ఆపకపోవడంతో.. అబ్బాయిలైతే ఏకంగా ప్రాణాలకు తెగిస్తున్నారు. రోడ్డుపై వెళ్లే ట్రాక్టర్లను ఆపి, వాటి వెనుక ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఏ చిన్న అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ఇలా విద్యార్థుల కోసం బస్సులు ఆపకుండా వెళ్తున్న డ్రైవర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, చిట్కుల గ్రామం వద్ద బస్సులు ఆపాలని, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

వీడియో చూడండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే