OTT Movie: థియేటర్లలో బ్యాన్.. డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్సీ మూవీ.. IMDBలో 9.7 రేటింగ్
నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇందులో కొన్ని వివాదాస్పద సన్నివేశాలు ఉండడతో సెన్సార్ బోర్డు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో మేకర్స్ డైరెక్టుగానే ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.

ఎప్పటిలాగే గత వారం కూడా ఓటీటీలోకి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అబ్సెషన్, మాలీవుడ్ టైమ్స్, హ్యాంగ్ మ్యాన్ వంటి సినిమాలతో పాటు సూపర్ సుబ్బు, ఇసకపట్నం, మర్మదేశం వంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడ చేస్తున్నాయి. వీటితో పాటు ఒక కాంట్రవర్సీ మూవీ కూడా ఓటీటీకి వచ్చింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇందులో కొన్ని వివాదాస్పద అంశాలు ఉండడంతో సెన్సార్ బోర్డ్.. తీవ్ర అభ్యంతరాలు చెప్పింది. ఏకంగా 127 కట్స్ సూచించింది. చిత్ర బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రియల్ స్టోరీని థియేటర్లలో రిలీజ్ చేయలేకపోయారు. దీంతో చివరకు డైరెక్టుగా ఓటీటీలోకి ఈ కాంట్రవర్సీ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పక చూడాల్సిన సినిమాగా చూసిన వాళ్లు సోసల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
పంజాబ్‌కి చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదట ఈ సినిమాకు ‘పంజాబ్ 95’ అని పేరు పెట్టారు. అయితే సెన్సార్ బోర్డు అభ్యంతరాలతో చివరకు ‘సత్లుజ్’గా టైటిల్ మార్చి ఓటీటీలోకి తీసుకొచ్చారు. దర్శకుడు హనీ టెహ్రాన్ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ లీడ్ రోల్ చేశాడు. అలాగే ధురంధర్ విలన్ అర్జున్ రాంపాల్ మరో కీలక పాత్ర పోషించాడు. పంజాబ్‌లో 25,000 మందిని అన్యాయంగా పోలీసులు చంపిన సంగతి.. తన రీసెర్చ్ ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులే జస్వంత్ ను చంపారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా వివాదాస్పద అంశాలు ఉండడంతోనే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 127 కట్స్ చెప్పింది. అయితే రెండు రోజుల క్రితమే ఈ సినిమాను జీ5 ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడీ సినిమాను ఆడియెన్స్ తెగ చూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ ఈ కాంట్రవర్సీ మూవీని బాగా ఆదరిస్తున్నారు. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
జీ5 ఓటీటీలో ధురంధర్ నటుడి సినిమా..
Powerful. Honest. Earned. Satluj, inspired by true events. Watch ‘Satluj’ streaming now only on ZEE5#SatlujOnZEE5@diljitdosanjh @rampalarjun #SuvinderPalVicky #GeetikaVidya #KanwaljitSingh @HoneyTrehan @RonnieScrewvala #AbhishekChaubey #PashanJal #ChetanaKowshik @nirenbhatt… pic.twitter.com/9Z0yEwk9Aj
— ZEE5Official (@ZEE5India) July 4, 2026
‘సత్లుజ్’ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




