Andhra Pradesh: వాళ్లది డీఎస్‌సీ.. వీళ్లది ఏపీపీఎస్‌సీ.. పరీక్షలను రౌండప్ చేసిన పాలిటిక్స్
ఏ ఫర్ ఆంధ్రా, పీ ఫర్ పాలిటిక్స్. పొలిటికల్లీ మాంచి డెన్సిటీ ఉండే రాష్ట్రంగా ఏపీకి ప్రత్యేక క్రెడిట్టే ఉంది. ఇక్కడ పార్టీలకు బీపీలు రైజవ్వడం ఎప్పుడూ కొత్తకాదు. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది ఏపీలో రాజకీయ చదరంగం. ఏ పార్టీ ఎప్పుడు ఏ పాచిక వేస్తుందో ఏ పార్టీకీ తెలీదు. ఎగస్పార్టీల్ని అనుక్షణం అణువణువూ చదువుతుండాల్సిందే. ఇక్కడ ప్రతీ ఇయరూ ఎలక్షన్ ఇయరే. ఓటుబ్యాంకులకు కన్నమెయ్యడం మీదే పార్టీలకు కన్ను. రాబోయే స్థానిక ఎన్నికలకు నగారా మోగకముందే, మందుగుండు సిద్ధం చేసుకుంటున్నాయి పార్టీలు. 2029కి ఇప్పటినుంచే వామప్ మ్యాచ్‌లకు ప్యాడ్లు కట్టుకుంటున్నాయి టీడీపీ-వైసీపీ. ఎలాగో డీటెయిల్డ్‌గా చూద్దాం.

స్వర్ణాంధ్ర, సుగుణాంధ్ర, సౌభాగ్యాంధ్ర సంగతేమో గాని, పెనం మీద అట్టులా ఉడికిపోతోంది పొలిటికలాంధ్ర. టీడీపీ అండ్ వైసీపీ. కత్తులు కటార్లూ కొత్తకొత్తగా నూరుకుంటున్నాయి. బ్రాండ్‌న్యూ ఆస్త్రాలతో రాష్ట్రాన్ని వార్‌జోన్‌గా మార్చేస్తున్నాయి. ఒక పార్టీ ఎత్తువేస్తే, దానికి ముందే పైఎత్తు రెడీ చేసుకుంటోంది ఇంకో పార్టీ. ఎవ్వరికెవరూ తీసిపొయ్యేలా లేరు. సడన్‌గా ఎందుకింతగా వేడెక్కింది ఏపీలో రాజకీయం? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఏపీలో రెండు పవర్‌ఫుల్ వెపన్స్‌తో పందెంకోళ్లలా ఢీకొడుతున్నాయి ప్రభుత్వం అండ్ విపక్షం. ఒకటి- మెగా డీఎస్‌సీ నిర్వహణలో లోపాలు, రెండోది- అమరావతి నిర్మాణానికి అవుతున్న ఖర్చు. నిన్నటిదాకా రోడ్డుమీదే నల్లజెండాలతో వాళ్లు, ప్రెస్‌మీట్లలో పచ్చజెండాల వెనుక వీళ్లు.. కౌంటర్లు -ఎన్‌కౌంటర్లతో తెగ బాదేసుకున్నారు. ఆగస్టు 17 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇవే చర్చకు రాబోతున్నాయా? త్వరలో రాబోయే స్థానిక ఎన్నికలకూ తూటాలు-తపంచాలు సిద్ధమైనట్టేనా? రాజధానికి తొలిమెట్టు పడింది.. ఇక అమరావతిని ఎవ్వరూ ఆపలేరు అని కూటమి ప్రభుత్వం దండోరా వాయిస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డును, ప్రజాప్రతినిధుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను అట్టహాసంగా ప్రారంభించి, అదరహో రేంజ్‌లో సౌండిచ్చింది కూటమి ప్రభుత్వం. వెంటనే సీన్‌లోకి వచ్చేశారు వైసీపీ ఫైర్‌బ్రాండ్ లీడర్లు. ఒక రోడ్డేసి, నాలుగు టవర్లు కట్టి, దాన్నే రాజధాని అంటారేంటి, మరీ విడ్డూరం కాకపోతే అని తిరగమాత పెట్టేస్తున్నారు. పని తక్కువ-ప్రచారం ఎక్కువ అని తమతమ స్టైల్లో సెటైర్లు దంచికొడుతున్నారు. అటు, అమరావతిలో నిర్మాణాలకయ్యే ఖర్చు కూడా పొలిటికల్ కంటెంట్‌గా మారిపోయింది. 21...
