AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి..

బడిలో పాఠాలు చెప్పే గురువులు ఎందరో ఉంటారు.. కానీ కొందరు మాత్రమే విద్యార్థుల మనసుల్లో దేవుడిలా నిలిచిపోతారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు ట్రాన్స్‌ఫర్ కావడంతో దానిని తట్టుకోలేక బడి పిల్లలంతా కన్నీరుమున్నీరయ్యారు. తమ అభిమాన సార్‌ను ఎలాగైనా ఆపాలని, వెళ్లనీయకుండా స్కూల్ గేటును సైతం మూసేసి పిల్లలు చేసిన ఆ పని చూస్తే ఎవరి కళ్లయినా చెమర్చాల్సిందే.

Video: సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన విద్యార్థులు.. వీడియో చూడండి..
Emotional Farewell To Teacher
Krishna S
|

Updated on: Aug 14, 2026 | 10:38 PM

Share

సాధారణంగా బడి పిల్లలకు ఉపాధ్యాయులంటే కాస్త భయం, క్రమశిక్షణతో కూడిన బెరుకు ఉంటాయి. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం బోధనతో పాటు తమ అపారమైన ప్రేమ, ఆప్యాయతలతో విద్యార్థుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. పిల్లలతో మంచిగా ఉంటూ, వారిలోని ప్రతిభను వెలికితీసే గురువులను పిల్లలు దేవుడిలా భావిస్తారు. అలాంటి ఓ ఉపాధ్యాయుడు వేరే పాఠశాలకు బదిలీ అయి వెళ్తుంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక విద్యార్థులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల కళ్లను చెమర్చుతోంది. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ భావోద్వేగ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌ను కదిలిస్తుంది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడికి వేరే ప్రాంతానికి బదిలీ అయింది. అయితే స్కూల్ నుంచి బయటకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా బోరున విలపించారు. తమ అభిమాన గురువు ఇకపై తమకు పాఠాలు చెప్పరనే నిజాన్ని వారు అస్సలు జీర్ణించుకోలేకపోయారు.

పాఠశాల ఆవరణ నుంచి ఆ ఉపాధ్యాయుడు బయటకు నడుచుకుంటూ వెళ్తుండగా వందలాది మంది విద్యార్థులు ఆయన చుట్టూ చేరి గట్టిగా ఏడుస్తూ, కేకలు వేస్తూ బతిమాలసాగారు. సార్‌ను ఎలాగైనా ఆపాలని భావించిన కొందరు విద్యార్థులు పరుగుపరుగున వెళ్లి పాఠశాల ప్రధాన గేటును మూసేసి అడ్డంగా నిలబడ్డారు. తమను విడిచి వెళ్లొద్దంటూ గురువు కాళ్లను పట్టుకుని, ఆయనను హత్తుకుని కన్నీరుమున్నీరయ్యారు. విద్యార్థుల స్వచ్ఛమైన ప్రేమను, రోదనను చూసి అక్కడున్న ఉపాధ్యాయులు, గ్రామస్థులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. సదరు టీచర్ కూడా పిల్లలను ఓదార్చలేక, తన కన్నీళ్లను ఆపుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నెటిజన్ల రియాక్షన్..

“గురువు అంటే కేవలం సిలబస్ పూర్తి చేసే వ్యక్తి మాత్రమే కాదు.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ వారి హృదయాల్లో నిలిచిపోయే మార్గదర్శి” అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటి యాంత్రిక సమాజంలో గురుశిష్యుల మధ్య ఇంతటి స్వచ్ఛమైన, పవిత్రమైన బంధం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని కామెంట్లు పెడుతున్నారు.

వీడియో చూడండి..

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?