AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్..

వానాకాలం వచ్చిందంటే చాలు.. వంటింట్లో కూరగాయలు నిల్వ ఉంచడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ముఖ్యంగా రోజూ వాడే టమాటాలు వాతావరణంలోని అధిక తేమకు రెండు మూడు రోజులకే మెత్తబడి, బూజు పట్టి పాడైపోతుంటాయి. ఫ్రిజ్‌లో పెట్టినా వాటి సహజసిద్ధమైన రుచి, తాజాదనం పోతుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు, ఫ్రిజ్ అవసరం లేకుండా మన పూర్వీకుల కాలం నాటి ఒక చిన్న దేశీ చిట్కాతో టమాటాలను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఎలా నిల్వ చేసుకోవచ్చో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Aug 14, 2026 | 10:02 PM

Share
ఫ్రిడ్జిలు అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు వాతావరణ మార్పులకు అనుగుణంగా కొన్ని సహజసిద్ధమైన సంప్రదాయ పద్ధతులను పాటించేవారు. అందులో మట్టి కుండ, పొడి ఇసుకతో కూరగాయలను నిల్వ చేసే విధానం ఎంతో పాపులర్. వానాకాలంలో వాతావరణంలోని అధిక తేమ నుంచి కూరగాయలను రక్షించి, టమాటాలు ఎక్కువ కాలం కుళ్లకుండా తాజాగా ఉంచేందుకు ఈ పురాతన పద్ధతి ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.

1 / 5
ఈ పద్ధతిని అనుసరించడానికి ఇంట్లో లభించే శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న మట్టి కుండ, మంచి పొడి ఇసుక ఉంటే సరిపోతుంది. మార్కెట్ నుంచి టమాటాలు కొనేటప్పుడే బాగా పండినవి కాకుండా కొద్దిగా గట్టిగా ఉన్న దోర టమాటాలను ఎంచుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో కాస్త మెత్తగా ఉన్నా లేదా నొక్కులు పడినా అవి వేగంగా కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.

2 / 5
తొలుత మట్టి కుండ అడుగు భాగాన ఒక పొరలా పొడి ఇసుకను సమానంగా పరవాలి. ఆ తర్వాత టమాటాలను ఒకదానికొకటి తాకకుండా విడివిడిగా అమర్చాలి. అనంతరం టమాటాలు పూర్తిగా కప్పిపోయేలా పైనుంచి మరో పొర పొడి ఇసుకను వేయాలి. ఆపై ఈ కుండను వర్షపు చినుకులు, గోడల చెమ్మ తగలని పొడి ప్రదేశంలో, గాలి ఆడేలా ఉంచాలి. మట్టి కుండ లోపలి తేమను అదుపులో ఉంచుతూ గది ఉష్ణోగ్రతను సమతుల్యంగా నిర్వహించడానికి సహకరిస్తుంది.

3 / 5
వానాకాలంలో ఈ విధానాన్ని పాటిస్తున్నప్పుడు పొడితనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇసుకలో ఎట్టి పరిస్థితుల్లోనూ తేమ ఉండకూడదు. తడి ఇసుక వాడితే టమాటాలు త్వరగా బూజు పడతాయి. నిల్వ చేయడానికి ముందు టమాటాలను నీటితో కడగకూడదు, ఎందుకంటే వానాకాలంలో వాటిపై మిగిలే స్వల్ప తేమ కూడా కుళ్లే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే వీటిని ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి నిల్వ చేయరాదు.

4 / 5
వర్షాకాలపు తేమ తీవ్రత దృష్ట్యా రెండు మూడు రోజులకు ఒకసారి కుండను తెరిచి టమాటాల పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలి. ఏదైనా టమాటా మెత్తబడినట్లు లేదా పాడవుతున్నట్లు కనిపిస్తే ఇతర టమాటాలకు బూజు సోకకుండా వెంటనే దాన్ని తొలగించాలి. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సులభమైన దేశీ చిట్కాను పాటిస్తే, వర్షాకాలంలోనూ టమాటాలను ఎక్కువ రోజుల పాటు ఎంతో తాజాగా ఉంచుకోవచ్చు.

5 / 5
Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..

వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?