కవ్విస్తున్న వింక్ గర్ల్.. సోషల్ మీడియాలో రచ్చ 

14 August   2026

Pic credit - Instagram

Rajeev 

ఒక్క చిన్న కంటిసైగతో దేశవ్యాప్తంగా రాత్రికి రాత్రే ప్యాన్-ఇండియా పాపులారిటీ సొంతం చేసుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్.

'ఒరు అడార్ లవ్' సినిమాలోని ఆ ఒక్క సీన్‌తో సోషల్ మీడియా సంచలనంగా మారిన ఆమె, ఆ తర్వాత తన నటనతో విభిన్న భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసింది. 

2019లో విడుదలైన మలయాళ చిత్రం 'ఒరు అడార్ లవ్'లోని 'మాణిక్య మలరాయ పూవి' అనే పాటలో ప్రియా చేసిన కంటిసైగ ఇంటర్నెట్‌లో ప్రభంజనం సృష్టించింది.

ఈ వీడియో క్లిప్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవ్వడంతో ఆమె రాత్రికి రాత్రే మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీగా మారిపోయారు.

ఆ సినిమా తర్వాత అభిమానులు, మీడియా ఆమెను ముద్దుగా "వింక్ గర్ల్" అని పిలవడం ప్రారంభించారు.

ఒక్క రోజే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ అభిమానులను కవ్విస్తుంది.