Watch: తిరుమలలో అరుదైన ఘట్టం.. 116 ఏళ్ల భక్తురాలికి వీఐపీ దర్శనం
తమిళనాడుకు చెందిన 116 ఏళ్ల శ్రీవారి భక్తురాలు నవనీతమ్మ అరుదైన భక్తి చాటారు. అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించారు. ఈ వీడియో వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. టీటీడీ అధికారులు ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. 116 ఏళ్ల వృద్ధురాలు, శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తురాలు నవనీతమ్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె రెండ్రోజుల క్రితం అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి.. ఆమె భక్తిని కొనియాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. టీటీడీ ఛైర్మన్ కార్యాలయ సిబ్బంది దగ్గరుండి ఆమెకు స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం బామ్మకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

