అప్పుడు కామెడీ షో యాంకర్.. కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరోయిన్
06 July 2026
Pic credit - Instagram
Rajeev
కెరీర్ బిగినింగ్ లో ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అస్తోపోవధ్ యారు అని పిలవబడే ఒక ప్రసిద్ధ కామెడీ షోలో ఆమె యాంకర్‌గా చేసింది.
ఆతర్వాత బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ ఐశ్వర్య రాజేష్. ఈ ముద్దుగుమ్మ.
అవగాళమ్ ఇవర్గలం (2011) లో సినిమాల్లో పరిచయమయింది. అత్తాచాటి (2012) లో నటించిన తరువాత మంచి పేరు వచ్చింది.
అలాగే మలయాళంలోనూ సినిమాలు చేసింది ఈ అందాల భామ. అదేవిధంగా హిందీలోనూ నటించింది ఐశ్వర్య రాజేష్.
అర్జున్ రాంపాల్ సరసన డాడీ అనే హిందీ సినిమాలో ఆమె తొలిసారిగా నటించింది. 2014 లో ఆమె నటించిన కాక ముట్టై అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది ఈ చిన్నది.
సంక్రాంతికి వస్తున్నాం భారీ హిట్ అందుకున్న ఈ అమ్మడు. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.