AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, July 18th Episode: బతుకు పండించుకోమన్న అత్తగారు.. రాజ్, కావ్యల రొమాన్స్ మొదలు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు రాజ్. అప్పూ గురించే ఆలోచిస్తూ కళ్యాణ్ ఆలోచిస్తూ.. ఎవర్నీ పట్టించుకోకుండా.. ఏమీ తినకుండా ఉంటాడు. అది గమనించిన రాజ్.. కళ్యాణ్‌తో మాట్లాడేందుకు సిద్ధమవుతాడు. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి రా? ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావ్? అని రాజ్ అడిగితే.. అప్పూ గురించి అన్నయ్యా.. నా వల్ల అప్పూ ఎంతో అవమానాలు ఎదుర్కుంటుంది. వాళ్ల ఫ్యామిలీ ఎన్నో మాటలు..

Brahmamudi, July 18th Episode: బతుకు పండించుకోమన్న అత్తగారు.. రాజ్, కావ్యల రొమాన్స్ మొదలు..
BrahmamudiImage Credit source: Disney Hotstar
Chinni Enni
|

Updated on: Jul 18, 2024 | 1:05 PM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు రాజ్. అప్పూ గురించే ఆలోచిస్తూ కళ్యాణ్ ఆలోచిస్తూ.. ఎవర్నీ పట్టించుకోకుండా.. ఏమీ తినకుండా ఉంటాడు. అది గమనించిన రాజ్.. కళ్యాణ్‌తో మాట్లాడేందుకు సిద్ధమవుతాడు. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి రా? ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావ్? అని రాజ్ అడిగితే.. అప్పూ గురించి అన్నయ్యా.. నా వల్ల అప్పూ ఎంతో అవమానాలు ఎదుర్కుంటుంది. వాళ్ల ఫ్యామిలీ ఎన్నో మాటలు పడుతున్నారు. నువ్వే చూశావు కదా అన్నయ్యా. అప్పూ ఎంత పని చేసిందో.. ఇక అప్పూ బాధ్యత నాదే. తన జీవితం చక్క పడేంత వరకూ నాకు కుదురు ఉండదని అంటాడు. నువ్వేం చేయగలవురా అని రాజ్ ఓదార్చుతాడు.

కావ్యకి అపర్ణ క్లాస్..

ఆ తర్వాత కళ్యాణ్‌కు కావ్య కూడా నచ్చజెప్పాలని చూస్తుంది. రాజ్, కావ్యలు ఇద్దరూ కళ్యాణ్ గురించి బాధ పడుతూ ఉంటారు. ఇదంతా గమనిస్తున్న అపర్ణ, ఇందిరా దేవిలు.. ఒక నిర్ణయానికి వస్తారు. వీరిద్దరినీ ఎలాగైనా ఒకటి చేయాలని ప్రయత్నిస్తారు. రాజ్‌ని పిలిచిన పెద్దావిడ.. తమ్ముడు జీవితం గురించి అన్నయ్య బాధ పడటంలో కరెక్ట్. అన్నయ్యగా తమ్ముడి బాధను అర్థం చేసుకున్నావ్. కానీ ఒక భర్తగా నీ భార్య గురించి మాత్రం ఎందుకు ఆలోచించడం లేదు. సంతోషంగా కాపురం చేస్తూ.. పిల్లాపాపలతో ఆనందంగా ఉంటే చూసి చచ్చిపోవాలని ఉంది అని అంటుంది. నాన్నమ్మా ఏంటి ఆ మాటలు.. అలా మాట్లాడటం కరెక్ట్ కాదని రాజ్ అంటే.. మరి నువ్వు ఏం చేస్తున్నావ్? నీ మనసులో మాట కావ్యకి చెప్పావా.. తనకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నావా? అని పెద్దావిడ అడుగుతుంది. రాజ్ నీళ్లు నములుతాడు.

బెడ్ రూమ్‌కి వచ్చిన ప్రేమ జంట..

కట్ చేస్తే.. మరోవైపు కావ్యకి కూడా అత్తగారు కూడా వార్నింగ్ ఇస్తుంది. నీకు ఎప్పుడూ వాళ్ల సమస్య తీర్చడానికి.. వీళ్ల సమస్య తీర్చడానికి తప్ప.. అసలు నీ కాపురమే నీకు పెద్ద సమస్యగా మారిందని గుర్తుండదా ఏంటి? పెళ్లి చేసుకున్నందుకు నీ బతుకు పండాలి.. కడుపు పండాలి.. అప్పుడే ఒక మహిళ జీవితం సార్ధకం అవుతుంది. ఈ వంశానికి వారసుడు కావాలి. ఇంక విడిగా ఉండొద్దు.. మీరిద్దరూ ఒకటి కావాలి. ఇప్పటినుంచే మీ కాపురం మొదలు పెట్టమని చెబుతుంది అపర్ణ. ఇందిరా దేవి, అపర్ణల మాటలు విన్న కావ్య, రాజ్‌లు ఒకటే సారి బెడ్ రూమ్‌కి వస్తారు. మరి ఈసారి అయినా రాజ్, కావ్యల మధ్య రొమాన్స్ మొదలవుతుందా.. లేక మరెవరైనా అడ్డు పడతారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..