Brahmamudi, June 26th Episode: రుద్రాణి కన్నింగ్ ప్లాన్.. రాజ్, కావ్యల శోభనం నాశనం..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్, కావ్యల శోభనం ఏర్పాట్ల గురించి ఎవరికీ తెలీకూడదని పెద్దావిడ ప్లాన్ చేస్తుంది. దానికి అందరూ రెడీ అంటారు. అప్పుడే కావ్య వచ్చి ఏంటి ఎందుకు రెడీ అంటున్నారని అడుగుతుంది. రుద్రాణి చెప్పబోతే.. స్వప్న ఆపుతుంది. ఇంతలో ప్రకాశం నేను వెళ్లి ఫ్రూట్స్ తీసుకొస్తాను అని అంటాడు. ఫ్రూట్స్ ఎందుకు అని కావ్య అడిగితే.. నాకే పేషెంట్‌ని కదా.. అయినా నీకు అవసరమా? వెళ్లి పని చేసుకోవచ్చు కదా..

Brahmamudi, June 26th Episode: రుద్రాణి కన్నింగ్ ప్లాన్.. రాజ్, కావ్యల శోభనం నాశనం..
Brahmamudi
Follow us

|

Updated on: Jun 26, 2024 | 12:32 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్, కావ్యల శోభనం ఏర్పాట్ల గురించి ఎవరికీ తెలీకూడదని పెద్దావిడ ప్లాన్ చేస్తుంది. దానికి అందరూ రెడీ అంటారు. అప్పుడే కావ్య వచ్చి ఏంటి ఎందుకు రెడీ అంటున్నారని అడుగుతుంది. రుద్రాణి చెప్పబోతే.. స్వప్న ఆపుతుంది. ఇంతలో ప్రకాశం నేను వెళ్లి ఫ్రూట్స్ తీసుకొస్తాను అని అంటాడు. ఫ్రూట్స్ ఎందుకు అని కావ్య అడిగితే.. నాకే పేషెంట్‌ని కదా.. అయినా నీకు అవసరమా? వెళ్లి పని చేసుకోవచ్చు కదా అని అపర్ణ అంటుంది. మళ్లీ ఎందుకు అందరూ రెడీ అంటున్నారు? అని కావ్య అడిగితే.. అపర్ణ తిడుతుంది. అందుకు అందరూ నవ్వుతారు. ఇక అక్కడి నుంచి కావ్య వెళ్లిపోతుంది. చెప్పు అమ్మా.. లిస్ట్ ఏంటి? అని ప్రకాశం.. స్వప్నని అడిగి రాస్తూ ఉంటాడు. ఇక్కడ కామెడీ సీన్ అదిరిపోతుంది.

అంతా అయోమయం.. గందర గోళం..

ఆ తర్వాత రాజ్ వచ్చి ఏంటి? స్వీట్స్, ఫ్రూట్స్ అంటున్నారు దేనికి? అడుగుతాడు. నేను మర్చిపోయాను రా.. స్వప్నకు తెలుసు అని ప్రకాశం అంటే.. ఏదో ఉంది నేనూ కూడా మర్చిపోయానని స్వప్న అంటుంది. స్వీట్స్, ఫ్రూట్స్‌, ఫ్లవర్స్ ఎందుకు అని రాజ్ ఆలోచిస్తూ ఉండగా.. ప్రకాశం తింగరిగా మాట్లాడతాడు. అప్పుడే అపర్ణ వచ్చి.. పూజకు రా అని అంటుంది. మొన్నే కదా పూజ అయ్యింది. మళ్లీ ఇప్పుడు పూజ ఏంటి? అని రాజ్ అంటే.. ఆషాఢ అమావాస్య పూజ అని కవర్ చేస్తుంది. ఏంటయ్యా లిస్ట్ రాసుకున్నావా వెళ్లు ఇక అని అపర్ణ అంటే.. ఎక్కడికి అని అడుగుతాడు తింగరి ప్రకాశం. అయ్యో మమ్మీ నువ్వు బాబాయి మర్చిపోతాడు కానీ నేను తీసుకొస్తానులే అని రాజ్ అంటాడు. కరెక్ట్ రా నీకు ఏది నచ్చితే అవే తెచ్చుకోమని అంటాడు ప్రకాశం. ఇలా మొత్తం కన్ ఫ్యూజ్‌గా సాగుతుంది. దీంతో ఆలోచనలో పడతాడు రాజ్. ఏంటో ఈ వింత పూజలు అని అనుకుంటాడు.

రాజ్, కావ్యల శోభనం నాశనం..

ఈ సీన్ కట్ చేస్తే.. రాహుల్, రుద్రాణిలు గదిలో కూర్చొంటారు. మామ్.. ఇంట్లో వాళ్లందరూ కలిసి పోయారు కదా.. మనకు డైజీషియన్ అవ్వదు కదా.. నిమ్మకాయ పెట్టుకుని తింటే అరుగుతుంది కదా అని రాహుల్ అంటాడు. దీంతో రుద్రాణి కోపంగా చూస్తుంది. నువ్వు నన్ను కోపంగా చూసినా సరే.. కావ్యని ఇది చేస్తా.. అది చేస్తా.. ఇంట్లోంచి పంపించేస్తా అన్నావ్ కదా.. ఇప్పుడు ఏమైంది. అందరూ కలిసి వాళ్లకు ఫస్ట్ నైట్ చేస్తున్నారు. ఇంతకు ముందు కావ్యని భార్యగా చూడలేదు రాజ్. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్‌తో ఇద్దరూ కలిసి పోతారు. ఆ తర్వాత వాళ్లకు పుట్టిన పిల్లలు ఈ ఇంటికి వారసులు అవుతారు. వాళ్లకు ఆస్తులన్నీ అప్పగించేస్తారని రాహుల్ అంటాడు. నేను ఉండగా అలా ఎలా కలిసి పోతారు? సంతోంగా ఎలా బ్రతకనిస్తాను? మనం చేస్తే తప్పు అవుతుంది. అదే ఈ ఇంట్లో మనిషి చేస్తే. ఈ రోజు రాత్రి ఒక చిన్న చిచ్చు రాజేస్తున్నా.. ఇప్పుడు ఈ ఇల్లు రావణ కాష్ఠం అవుతుందని రుద్రాణి అంటుంది.

ఇవి కూడా చదవండి

అనామికను కాదన్న కళ్యాణ్..

ఆ తర్వాత కళ్యాణ్ గదిలో రెడీ అవుతూ ఉంటాడు. అనామిక సిగ్గు పడుతూ వచ్చి తలుపు వేస్తుంది. కళ్యాణ్‌కి దగ్గరకు వస్తుంది. భార్య అందంగా రెడీ అయి వచ్చి.. గడియ పెడితే తెలీదా? నువ్వు మరీ అంత ముద్దపప్పు కాదని నాకు తెలుసు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. ఆఖరికి మీ వదినా, అన్నయ్యలు కూడా కలిసి పోయారు. మనం మాత్రం ఇలా గొడవలు పడుతూ ఇలా ఎందుకు ఉండాలి చెప్పు అని అనామిక అంటే.. ఇదే మాట నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర్నుంచి చెప్పా నువ్వు విన్నావా. నేను అలిసి పోయాను. నీ మొండి తనంతో నా మనసును వేళ్లతో సహా పెకిలించావ్ అని కళ్యాణ్ సీరియస్ అవుతాడు. అంటే నువ్వు నన్ను నమ్మవా.. నీ కోసం నేను ఏమీ చేయలేదా అని అనామిక అడుగుతుంది.

రిపోర్టర్ నుంచి కళ్యాణ్‌కు ఫోన్..

ఈ ఇంటి కోసం మా వదిన ఎంత కష్టం పడిందో తెలుసా? ఎన్ని అవమానాలను ఎదుర్కొందా తెలుసా? మా అన్నయ్య తీసుకొచ్చిన బిడ్డకు అమ్మ అయింది. కానీ నువ్వు ఏం చేశావ్? చేయని తప్పుకు అనుమానించావ్? అవమానించావ్? అని కళ్యాణ్.. అనామికకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అప్పుడే కళ్యాణ్‌కు ఫోన్ వస్తుంది. హలో సర్ నా పేరు సంగీత రిపోర్టర్‌ని అని ఫోన్ చేస్తే… మిమ్మల్ని మోసం చేశారని చెప్పడానికే కాల్ చేశాను, మీ పరువు తీయడానికే ఇదంతా జరిగింది. మీరు నన్ను ఒకసారి కలిస్తే మీకు అంతా చెప్తానని సంగీత అంటుంది.

కావ్య, రాజ్‌ల శోభనం.. ఇంట్లో హంగామా..

సరే ఇప్పుడే వస్తున్నా అని కళ్యాణ్ వెళ్తాడు. ఇక స్వప్న.. గది అంతా సిద్ధం చేస్తుంది. అప్పుడే ప్రకాశం వచ్చి స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొస్తాడు. అప్పుడే కావ్య వచ్చి బాబు డైపర్స్ ఉన్నాయి. కావాలని కావ్య అంటే.. నేను మారుస్తానులే.. తెస్తానులే నువ్వు వెళ్లు. నాకు కాఫీ తీసుకురా అని ఇందిరా దేవి మ్యానేజ్ చేస్తుంది. అప్పుడు అపర్ణ అగరత్తులతో ఎదురు పడుతుంది. ఎందుకు? అని కావ్య అడిగితే.. ఇంట్లో ఎలుక చచ్చిన వాసన వస్తుంది. ఇవి వెలిగించి ఇళ్లంతా తిరుగుదామని కవర్ చేస్తుంది అపర్ణ. ఆ వాసన నాకు రావడం లేదని కావ్య అంటే.. ఇక అపర్ణ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఇందిరా దేవి గదికి రాజ్ వస్తాడు. సుభాష్ అడ్డం పడి.. నువ్వెక్కడికి? అడుగుతాడు. చార్జర్ మర్చిపోయా అని రాజ్ చెప్తే.. చార్జర్ మర్చిపోయావా అని గట్టిగా అరుస్తాడు సుభాష్. ఎందుకు డాడీ అంత గట్టిగా అరుస్తాడు సుభాష్. అప్పుడే ప్రకాశం చార్జర్ తీసుకొచ్చి వస్తాడు. ఇక అంతా అయోమయంగా ఉంటుంది. ఈ సీన్ అంతా నవ్వు తెప్పిస్తుంది.

పాపం రాజ్‌ని ఓ ఆట ఆడుకున్నారు కదా..

ఇక రాజ్ గదిలో.. సీతా రామయ్య, ఇందిరా దేవిలు కూర్చుని నవ్వుకుంటూ ఉంటారు. వాళ్లను చూసి రాజ్ అయోమయం ఫీల్ అవుతాడు. అవును మీరేంటి? ఇక్కడ నా దగ్గరకు వచ్చారా? అని రాజ్ అంటే.. ఇక కవర్ చేస్తుంది ఇందిరా దేవి. వెళ్లి మా గదిలో పడుకోమని పెద్దావిడ, పెద్దాయన అంటారు. ఇక రాజ్, కావ్యలు కిందకు వెళ్తారు. అక్కడ గదిలో డెకరేషన్ చూసి షాక్ అవుతారు. ఇక మరి రేపటి ఎపిసోడ్‌లో రాజ్, కావ్యల శోభనం ఖచ్చితంగా ఆగిపోతుందని తెలుస్తుంది.

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!