Brahmamudi, June 25th Episode: రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. కావ్యని పడేయటానికి రాజ్ కష్టాలు పడుతూ ఉంటాడు. కావ్య వెనుక తిరుగుతూ ఉంటాడు. అప్పుడే కావ్య నడుము చూసి ఫిదా అవుతాడు. పాటలు పడుతూ వింటూ ఉంటాడు. ఏంటి శ్రీవారు కొత్తగా కనిపిస్తున్నారు. ఓ ఆట ఆడిద్దామని కావ్య అనుకుంటుంది. అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ వైరల్ సీన్ నడుము సీన్ రిపీట్ అవుతుంది. మీరు నా నడుము చూశారని కావ్య ఆట పట్టిస్తుంది. దీంతో రాజ్ షాక్ […]

Brahmamudi, June 25th Episode: రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..
Brahmamudi
Follow us

|

Updated on: Jun 25, 2024 | 12:57 PM

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. కావ్యని పడేయటానికి రాజ్ కష్టాలు పడుతూ ఉంటాడు. కావ్య వెనుక తిరుగుతూ ఉంటాడు. అప్పుడే కావ్య నడుము చూసి ఫిదా అవుతాడు. పాటలు పడుతూ వింటూ ఉంటాడు. ఏంటి శ్రీవారు కొత్తగా కనిపిస్తున్నారు. ఓ ఆట ఆడిద్దామని కావ్య అనుకుంటుంది. అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ వైరల్ సీన్ నడుము సీన్ రిపీట్ అవుతుంది. మీరు నా నడుము చూశారని కావ్య ఆట పట్టిస్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. దీన్ని ఎలా పడేయాలని ఆలోచిస్తాడు. ఆ తర్వాత అప్పూ బయటకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఎందుకు? ఎక్కడికి వెళ్తున్నావ్? అని కనకం అడిగితే.. ఇంతకు ముందు కూడా నేను బయటకు వెళ్లాను.. అప్పుడు ఎందుకు అడగలేదు. అప్పుడూ ఇప్పుడూ వెళ్లేది నేనే కదా అని అప్పూ అంటే.. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇంత జరిగిన తర్వాత కూడా నీ పాటికి నువ్వు బయటకు వెళ్తావా? పళ్లు రాలగొడతాను. నీ గురించి అందరూ ఎలా మాట్లాడుతున్నారు కదా.. తెలిసి కూడా ఇప్పుడు బయటకు వెళ్తావా? అని కనకం అడిగితే.. నీ బాధ భయం అర్థమైంది. నీ కూతుళ్లు కష్ట పడకూడదని అనుకుంటున్నావ్.. అందుకు మేము కష్ట పడాలి కదా అని అప్పూ అంటే.. అవసరం లేదు. ఇప్పుడు పెళ్లి చేస్తాం.. అక్కడికి వెళ్లి చేసుకో అని కనకం అంటుంది. పోలీస్ అవ్వాలి అన్నది నా కల. ఈ రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా.. నన్ను వెళ్లనివ్వు అని అప్పూ అంటే.. నువ్వు రోజు రోజుకూ ఇలా మొండిగా తయారైతే ఎలా? అని కనకం అంటే.. అప్పుడే బంటీని కూడా తీసుకెళ్తుంది అప్పూ.

నా మనసు మార్చేసిందో నాకే తెలీదు..

ఈ సీన్ కట్ చేస్తే.. రాజ్ ఇంట్లోకి వస్తాడు. రాజ్‌కి ఎదురు పడిన పెద్దావిడ.. అసలు ఏం జరుగుతుంది? అని అడుగుతుంది. ఏమీ జరగడం లేదని రాజ్ అంటాడు. ఇందాక గార్డెన్‌లో నువ్వు వేసి వెధవ వేషాలు అన్నీ చూశానని అంటే.. రాజ్ ఉలిక్కి పడి.. కావ్యని కంట్రోల్ పెడుతున్నా.. అది సెట్ అయిపోయిందని రాజ్ అంటే.. సెట్ అయ్యిందా లేక సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా అని పెద్దావిడ అడుగుతుంది. రాజ్ నీళ్లు నములుతాడు. చాలు ఆపురా.. ఇంకా ఎన్నాళ్లు ఇలా దోబూచులాడుతావ్? కానీ ఎక్కడో ఒక చోట మనసులో ఉన్న ప్రేమను చూపించాలి కదా.. ఇంకా ఎన్నాళ్లు కావ్యని బాధ పెడతావ్? అసలు నీ మనసులో ఏముందని ఇందిరా దేవి అడిగితే.. ఇదే ప్రశ్న నాకు నేను అద్దంలో చూసి చాలా సార్లు ప్రశ్నించుకున్నా నాన్నమ్మా.. నాదే తప్పు అని నా మనస్సాక్షి చెబుతూనే ఉంది. తను నాకు కరెక్ట్ కాదు.. అనుకున్నా. కానీ కళావతి ఎప్పుడు నా మనసు మార్చేసిందో నాకే తెలీదు.

తను నన్ను భర్తగా అంగీకరిస్తుందో లేదో..

అందరూ బావుండాలి అనే నా ఆలోచనను తన ఆలోచనగా మార్చుకుంది. ఎన్ని అవమానాలు పడినా లెక్క చేయలేదు. మీ మనసు నేను గెలుచుకుని తీరతాను అని నాతోటే ఛాలెంజ్ చేసింది. జీవితంలో నిన్ను ఎప్పటికీ కోడలిగా అంగీకరించను అన్న మా అమ్మ మనసు కూడా కరిగించేసి తన వైపుకు తిప్పేసుకుంది. అలాంటి మనిషిని నేను భార్యగా అంగీకరించడం ఏంటి? తను నన్ను భర్తగా అంగీకరిస్తుందో లేదో అడగాలి అని రాజ్ అంటాడు. మరి ఇంకేంటి తనతో చెప్పేయ్ అని పెద్దావిడ అంటే.. నన్ను తను స్వార్థ పరుడిలా చూస్తాదేమోనని ఆలోచిస్తున్నా. మనసులో మాట చెప్పడానికి ఒక మంచి సందర్భం కావాలి. చుట్టూ ప్రశాంతంగా అందంగా ఉండాలి. నేను ధైర్యంగా చెప్పే ప్రదేశం అయి ఉండాలి. అలాంటి ప్లేస్ దొరకగానే వెంటనే చెప్పేస్తాను అని రాజ్ అంటాడు. వీడికి కావాల్సిన ఆ ప్రదేశాన్ని నేనే సిద్ధం చేస్తాను అని పెద్దావిడ అనుకుంటుంది.

ఇవి కూడా చదవండి

అనామికకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన అప్పూ..

ఇక అప్పూ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అనామిక కారులో ఎదురుగా అడ్డంగా వస్తుంది. అనామికను చూసిన అప్పూ.. కోపంగా బయటకు వస్తుంది. కావాలనే అప్పూని రెచ్చగొట్టేందుకు అనామిక ట్రై చేస్తుంది. అప్పూకి వార్నింగ్ ఇచ్చేందుకు అనామిక వస్తుంది. కారు తీయ్ మేము వెళ్లాలి అని అప్పూ అంటుంది. మీరు వెళ్లింది వేరే పని మీద అయితే.. అక్కడికి మీడియా వాళ్లు ఎలా వచ్చారు? సరిగ్గా మిమ్మల్ని ఎలా టార్గెట్ చేశారు అనుకుంటున్నావ్? ఏంటి బల్బ్ వెలగలేదా? అదంతా ప్లాన్ చేయించింది.. నేనే అని అనామిక చెప్తుంది. ఓహో ఆ పనికి మాలిన పని చేసింది నువ్వా? అప్పూ అంటుంది. ఇంకొకరి జీవితంతో కలిసి ఆడుకోవడం నువ్వు చేసే పని.. మాకు అలవాటు లేదని అప్పూ అంటుంది. అవమానం జరిగినా.. పొగరు మాత్రం తగ్గలేదని అనామిక అంటే.. నిజానికి ఉండేదే అది అని అప్పూ అంటుంది. నేను అనుకుంటే ఏం చేయగల నో నీకు అర్థమైందా? నా మొగుడితో కలిసి ఇంకొక సారి కలిసి తిరిగితే ఏం చేస్తానో తెలుసా అని అనామిక అంటే.. ఇంతకన్నా నువ్వేం చేయలేవు కానీ.. పక్కకు తప్పుకో అని వెళ్తుంది అప్పూ.

రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం..

ఆ తర్వాత హాలులో అపర్ణ, ఇందిరా దేవి, ప్రకాష్‌లు కూర్చొంటారు. అప్పుడే స్వప్న కూడా వస్తుంది. ఆ వెనుకే రుద్రాణి కూడా వస్తుంది. ఏంటి ఇక్కడేం జరుగుతుంది? అని అపర్ణ అడిగితే.. పెళ్లి అయి ఇంత కాలం అయినా.. రాజ్, కావ్యల మధ్య ఏమీ జరగలేదు. ఇవాళ రాత్రి వాళ్లిద్దరికీ శోభనం ఏర్పాటు చేస్తున్నా.. ఇవాళ్టికి అన్ని సమస్యలూ తీరిపోయాయి. కాబట్టి ఇవాళ మొదటి రాత్రి ఏర్పాటు చేస్తానని పెద్దావిడ చెబుతోంది. ఓ పిచ్చి మొద్దుకు.. ఓ వెర్రి సన్నాసికి శోభనం బాగానే ఉందని అపర్ణ అంటుంది. రాజ్, కావ్యలకు తెలియకుండా.. ఇదంతా ఏర్పాటు చేయాలని ఇందిరా దేవి చెబుతుంది. ఈలోపు మధ్యలో రుద్రాణి పుల్ల విరుపు మాటలు అంటుంది. దీంతో అందరూ సీరియస్‌గా చూస్తారు. నిన్ను ఎవరు పిలిచారు. వాళ్లు వాళ్లు ఏవో ప్లాన్లు చేస్తున్నారు కదా.. అని అపర్ణ అంటుంది. అంతా నేను చూసుకుంటాను లే అని స్వప్న అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో మరి ఏం జరుగుతుందో చూడాలి.