Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ నుంచి మాధురి ఎలిమినేట్. మూడు వారాలకు ఎంత సంపాదించిందంటే..
బిగ్ బాస్ సీజన్ 9 మరో ఎలిమినేషన్ పూర్తైంది. ముందు నుంచి సోషల్ మీడియా పోలింగ్స్ ప్రకారమే ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది మాధురి. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఆమె మొదటి రోజు నుంచి హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా మారింది. గొడవలతో నానా హంగామా చేసింది. కానీ ఇప్పుడు అనుహ్యంగా మూడు వారాల్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

బుల్లితెరపై టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ప్రసారమవుతుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఆ తర్వాత ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. ఇక ఇప్పటివరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, హరిత హరీష్, ప్రియ, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ, రమ్య మోక్ష, భరణి ఎలిమినేట్ కాగా.. గత వారం భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హౌస్ లో మరో ఎలిమినేషన్ జరిగింది. ఫైర్ బ్రాండ్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన మాధురి కేవలం మూడు వారాల్లోనే బయటకు వచ్చేసింది. ఈ వారం గౌరవ్, మాధురి డేంజర్ జోన్ ఉండగా.. గౌరవ్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చిన తర్వాత తన బిగ్ బాస్ జర్నీ ఏవీ చూసి ఎమోషనల్ అయ్యింది. మాధురి ఎలిమినేట్ కావడంతో తనూజ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి : Jabardasth: నైట్ వాచ్మెన్ నుంచి సినిమాల్లో నటుడిగా.. ఈ జబర్దస్త్ కమెడియన్ జీవితంలో ఇన్ని కష్టాలా.. ?
స్టేజ్ పైకి వచ్చాక ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పుకొచ్చింది మాధురి. బయట ఉన్నప్పుడు తనూజ మాస్క్ తో ఆడుతుంది అనుకున్నానని..కానీ తను తనలాగే ఆడుతుంది.. తను చాలా స్వీట్ అంటూ కంటతడి పెట్టుకుంది. దీంతో ఏడవనన్నావ్ నేను ఏడవట్లేదు.. అంటూ తనూజ కూడా ఎమోషనల్ అయ్యింది. కళ్యాణ్ చాలా జెన్యూన్ అని .. ఎలాంటి మాస్క్ లేకుండా చాలా చక్కగా ఆడుతున్నాడని.. డీమాన్ చాలా స్వీట్ అండ్ క్యూట్ బాయ్ అని చెప్పింది. భరణి ముళ్లు ఇస్తూ.. 100 పర్సంట్ ఫేక్ ఎవరైనా ఉన్నారంటే మాస్క్‌తో భరణి అని.. అందరిని వెన్నుపోటు పొడుస్తారని చెప్పింది. ఆ తర్వాత దివ్యకు ముళ్లు ఇస్తూ.. తన గేమ్ కంటే పక్కవాళ్ల గేమ్ పైనే ఎక్కువ కాన్సట్రేషన్ పెడుతుంది.. పక్కవాళ్ల గేమ్ ఎక్కువ ఆడటానికి ట్రై చేస్తూ ఉంటుందని చెప్పింది.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మాధురి మొదటి రోజునే పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో ఇప్పుడిప్పుడే తన ఆట తీరు సైతం మార్చేసింది. మొదట్లో గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మాధురి.. ఆ తర్వాత తన ఆట, మాట తీరుతో జనాలకు దగ్గరయ్యింది. అదేసమయంలో ఊహించని విధంగా బయటకు వచ్చేసింది. అయితే దాదాపు 3 వారాలు ఇంట్లో ఉన్న మాధురి సుమారు లక్ష 20 వేల రూపాయలు అందుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..




