Bigg Boss 9 Telugu : ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్.. దివ్వెల మాధురి బయటకు..
బిగ్ బాస్ సీజన్ 9.. గత రెండు వారాలుగా రసవత్తరంగా సాగుతుంది. ముఖ్యంగా వరుసగా టాస్కులతో హౌస్మేట్స్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇక ఈరోజు మరో ఎలిమినేషన్ కు రంగం సిద్ధమైంది. ఈ వారం డేంజర్ జోన్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ ఉండగా.. టాప్ లో తనూజ, కళ్యాణ్ దూసుకుపోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ వారం ఎలిమినేషన్ ఎవరనేది బయటకు వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లో ఈరోజు మరో ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధమయ్యింది. నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కొక్కరిని ఊతికారేశారు నాగ్. ఒక్కో కంటెస్టెంట్ ఫోటో ఫ్రేమ్ పై కత్తి గుచ్చి తప్పులకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ముఖ్యంగా డీమాన్ పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యూయేల్, భరణి, దివ్యలపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా రీతూతో పవన్ గొడవ పడడం అదే సమయంలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడంపై నాగ్ ఫైర్ అయ్యారు. డీమాన్ పవన్ బయటకు వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. అయితే హౌస్మేట్స్ అందరి అభిప్రాయంతో ఏకభవించిన నాగ్.. చివరకు మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు చెప్పేలా చేశారు. ఇక ఆదివారం తనూజ గురించి మాట్లాడదాం అంటూ నిన్నటి ఎపిసోడ్ ముగించారు.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇక ఈవారం మరో ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫైర్ బ్రాండ్ లా ఇంట్లోకి అడుగుపెట్టింది మాధురి. రావడంతోనే పేరు తెలియదు అని చెప్పడంతో శ్రీజపై ఫైర్ అయ్యింది. నా పేరు కూడా తెలియదా అంటూ నానా హంగామా చేసింది. ఆ తర్వాత తనూజ, కళ్యాణ్, రీతూ, పవన్ బాండింగ్స్ పై కామెంట్స్ చేసింది. హౌస్ లో ప్రతి విషయానికి గొడవ పడుతూ.. రచ్చ చేయడంతో తీరు మార్చుకోమని నాగ్ పలుమార్లు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
దీంతో గత వారం రోజులుగా మాధురి ఆట తీరులో చాలా మార్పు వచ్చింది. హౌస్ లోకి ఎంటర్ అవుతూ బాండింగ్స్ పై విమర్శలు చేసిన మాధురి.. ఇప్పుడు తనూజతో క్లోజ్ గా ఉంటుంది. అలాగే టాస్కులలోనూ అందరితో కలిసి గట్టిగానే ఫైట్ చేసింది. ఇప్పుడిప్పుడే పాజిటివిటీ సొంతం చేసుకుంటున్న మాధురి.. ఇప్పుడు ఉన్నట్లుండి హౌస్ నుంచి బయటకు వెళ్లడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. హౌస్ లోకి ఫైర్ బ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన మాధురి.. మూడు వారాలకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..




