Bigg Boss 9 Telugu : ఇదెక్కడి ట్విస్టు సామీ.. ఓటింగ్‌లో దూసుకొచ్చిన ఆ కంటెస్టెంట్.. ఎలిమినేషన్‌కు దగ్గరగా డీమాన్.. ?
బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. సంతోషాలు, ఎమోషన్స్ మధ్య ఈ వారం భావోద్వేగ క్షణాలతో సాగుతుంది. మరోవైపు ఇంకో ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడుతుంది. దీంతో ఈవారం ఎవరు బయటకు రాబోతున్నారనే విషయం సైతం ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో మూడు నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. మరోవైపు ఇప్పుడు హౌస్ లో ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులను హత్తుకుంటున్నాయి. ఫ్యామిలీ వీక్ లో భాగంగా తమ ఇంట్లో వారిని చూసి ఎమోషనల్ అవుతున్నారు. ప్రతి లెవల్లో జనాలను ఎంటర్టైన్ చేస్తూ.. ఎమోషనల్ చేస్తూ సాగుతుంది. ముఖ్యంగా ఈవారం రీతూ, డీమాన్ ఇద్దరి మధ్య ఫైట్.. సంజన ఫ్యామిలీ ఎంట్రీ.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ క్షణాలు చూస్తూ అడియన్స్ సైతం ఎంజాయ్ చేస్తున్నారు. ఇదెలా ఉంటే.. అటు ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరపడింది. ఈ వారం ఎవరు ఎలిమినేటర్ కాబోతున్నారనే సస్పెన్స్ కూడా నెలకొంది.
బిగ్ బాస్ సీజన్ 9.. ముందు నుంచి తనూజకు ఫేవర్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తుంది. ఆమె తప్పు చేసినా హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ సైతం ఆమెను ఒక్క మాట అనకపోవడం.. తనూజను ఎదురిస్తే ఇక ఆ కంటెస్టెంట్ పని అంతే అంటూ నెట్టింట మీమ్స్, ట్రోల్ జరుగుతున్నాయి. ఇక 11వ వారంలో కెప్టెన్ తనూజకే నామినేషన్ పవర్ ఇచ్చి. ఆమెకు నచ్చిన కంటెస్టెంట్స్ కు 1, 2 టోకెన్స్ ఇచ్చారు.ఈ వారం ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, భరణి, దివ్య నిఖిత, సంజన నామినేషన్లలో ఉన్నారు. సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓటింగ్ తో కళ్యాణ్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్, భరణికి సైతం మంచి ఓటింగ్ వస్తుంది. కానీ డీమాన్ పవన్, దివ్య నిఖిత , సంజన డేంజర్ జోన్ లో ఉన్నట్లు సమాచారం. పదివారాల తర్వాత నామినేషన్లలోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్ కు మంచి ఓటింగ్ వస్తుంది. ఈ వారం కళ్యాణ్ పడాల, భరణి, ఇమ్మాన్యుయేల్ ఇప్పటికే సేఫ్ అయినట్లు తెలుస్తోంది.
కానీ ఇప్పుడు సంజన, డీమాన్, దివ్య మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. నిజానికి దివ్య గత వారమే ఎలిమినేటర్ కావాల్సి ఉండగా.. ఆమెను సేవ్ చేసి గౌరవ్ ను బయటకు పంపించారు. భరణితో బాండింగ్ కోసం తనూజను టార్గెట్ చేయడమే ఆమె ఆటకు మైనస్ అయ్యింది. దీంతో ఆమెకు గత మూడు నాలుగు వారాలకు దారుణమైన ఓటింగ్ వస్తుంది. అయినప్పటికీ ఆమె సేవ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఆమె సేవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఒకవేళ దివ్య సేవ్ అయితే సంజన, డీమాన్ మాత్రమే డేంజర్ జోన్ లో ఉంటారు. వీరిద్దరిలో డీమాన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కానీ.. గేమ్ ను మలుపు తిప్పేందుకు అతడిని బయటకు పంపిన చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. డీమాన్ సేవ్ అయితే సంజన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలియాలంటే శనివారం వరకు వెయిట్ చేయాల్సిందే.
Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..
