Bigg Boss 8 Telugu: సీత ఎలిమినేట్.. ఆ ముగ్గురికి బ్లాక్ హార్ట్.. మెహబూబ్ స్పెషల్ గిఫ్ట్..
దీంతో ఇన్ఫినిటి రూంలో అన్ లిమిటెడ్ ఫుడ్ అడిగాడు నబీల్. ఇక ఆ తర్వాత హౌస్మేట్స్ మధ్య ఫన్నీ టాస్కులు పెట్టిన నాగ్.. యష్మి తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని సేవ్ చేయగా.. చివరగా సీత, మెహబూబ్ మిగిలారు. వీరిద్దరిలో సీత ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. సీత ఎలిమినేట్ కావడంతో విష్ణు ఏడ్చేసింది.
బిగ్‌బాస్ సీజన్ 8 ఆరో వారం ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. అందరూ ఊహించినట్లుగానే కిర్రాక్ సీత హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే వెళ్తూ వెళ్తూ.. హౌస్ లోపల ఉన్నవారికి, బయట అడియన్స్ కు షాకిచ్చింది. ఎవరూ ఊహించనివారికి బ్లాక్ హార్ట్, వైట్ హార్ట్స్ ఇచ్చి వెళ్లింది. నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా యష్మిని సేవ్ చేశాడు నాగార్జున. ఆ తర్వాత ఈ వారం బిగ్‌బాస్ ను ఏదైనా కోరిక కోరవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కానీ ఓజీ క్లాన్ నుంచి ఒకరు మాత్రమే వెళ్లడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పడంతో రాయల్ క్లాన్ నుంచి ఎక్కువ మంది నబీల్ ను ఎంపిక చేశారు. దీంతో ఇన్ఫినిటి రూంలో అన్ లిమిటెడ్ ఫుడ్ అడిగాడు నబీల్. ఇక ఆ తర్వాత హౌస్మేట్స్ మధ్య ఫన్నీ టాస్కులు పెట్టిన నాగ్.. యష్మి తర్వాత విష్ణుప్రియను సేవ్ చేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని సేవ్ చేయగా.. చివరగా సీత, మెహబూబ్ మిగిలారు. వీరిద్దరిలో సీత ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. సీత ఎలిమినేట్ కావడంతో విష్ణు ఏడ్చేసింది.
వెళ్లే ముందు హౌస్ లో ముగ్గురికి వైట్ హార్ట్, ముగ్గురికి బ్లాక్ హార్ట్ ఇవ్వాలని నాగ్ చెప్పగా.. విష్ణుకు వైట్ హార్ట్ ఇచ్చింది. తను చాలా ఇన్నోసెంట్ అని.. గేమ్ అసలు అర్దం కాలేదని చెప్పింది. బయటకు వెళ్లాక జీవితంలో మీ మమ్మీని మర్చిపోయేంత పెద్ద లవ్ దొరకాలి.. నీకొచ్చే పార్టనర్.. నువ్వు పెళ్లి చేసుకోబోయేవాడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు.. అందరినీ మర్చిపోతావు… ఇది కృష్ణుడు నీకోసం నాతో పలికిస్తున్న మాట అంటూ సీత చెప్పగానే విష్ణు ఏడ్చేసింది. ఇక తర్వాత రెండో హార్ట్ నా తమ్ముడు నబీల్ అంటూ చెప్పింది. చాలా బాగా ఆడతావు రైడర్ నువ్వు.. నాకు రియాల్టీ షోలో రియల్ పీపుల్ విన్ కావాలని ఉంది.. సో నిన్ను విన్నర్ గా చూడాలని ఉంది అంటూ సీత చెప్పడంతో నబీల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. మూడో హార్ట్ ఎవరూ ఊహించని విధంగా అవినాష్ కు ఇచ్చింది. రావడంతోనే హౌస్ లోకి ఏదో పాజిటివ్ ఎనర్జీ తీసుకోచ్చాడని..తను మాట్లాడుతుంటే నవ్వుతూనే ఉన్నానని తెలిపింది. ఐ లవ్ యూ అవి.. నువ్వు వచ్చి వారమే అయినా నువ్వు నాకు బాగా నచ్చావ్ అని చెప్పింది.
ఇక మూడు బ్లాక్ హార్ట్స్ లో మొదట నిఖిల్ కు ఇచ్చింది. నిఖిల్ పక్కా హజ్బెండ్ మెటీరియల్ అని.. కానీ ట్రాన్స్ పరెంట్ గా ఉండాలని తెలిపింది. ఎవరో నిన్ను రైట్ అనాలని అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడ మాటలు అక్కడ చెప్పకు..నీకు నచ్చింది మాట్లాడు.. నీకు ఏది రైట్ అనిపించిందో అదే రైట్.. ఇది గుర్తుపెట్టుకో అంటూ చెప్పుకొచ్చింది. ఇక తర్వాత రెండో హార్ట్ గౌతమ్ కు ఇచ్చింది. గౌతమ్ వచ్చిన జోష్ నచ్చిందని.. కానీ చిన్న చిన్న వాటికి హార్ట్ కావొద్దని.. సేఫ్ గా ఆడకు అంటూ సలహా ఇచ్చింది. ఆ తర్వాత మూడో బ్లాక్ హార్ట్ నయని పావనికి ఇచ్చింది. ఈ వారం నువ్వు వచ్చినప్పుడు నన్ను క్రై బేబీ అని నామినేట్ చేశావ్.. కానీ వచ్చిన వారానికే నాకంటే ఎక్కువ ఏడుస్తున్నావు అంటూ చెప్పుకొచ్చింది. చివరగా.. సీత తండ్రికి మెహబూబ్ బైక్ ను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.