Nirupam Paritala: మళ్లీ పెళ్లి చేసుకున్న డాక్టర్ బాబు.. మంజుల మెడలో మూడు ముళ్లు వేసిన నిరూపమ్.. వీడియో
కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నిరూపమ్ పరిటాల. అందులో డాక్టర్ బాబు పాత్రలో అద్భుతంగా నటించి ఎందరో అభిమానులను కూడగట్టుకున్నారు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్‌కు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక నిరూపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర నటినే. చంద్రముఖితో పాటు పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పిచిందీ అందాల తార.
కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నిరూపమ్ పరిటాల. అందులో డాక్టర్ బాబు పాత్రలో అద్భుతంగా నటించి ఎందరో అభిమానులను కూడగట్టుకున్నారు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్‌కు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇక నిరూపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర నటినే. చంద్రముఖితో పాటు పలు సీరియల్స్ లోనూ నటించి మెప్పిచిందీ అందాల తార. కాగా నిరుపమ్ పరిటాల, మంజులది ప్రేమ వివాహం. వీరిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్ లో నటించారు. చాలా కాలం ఈ సీరియల్ లో వీరి జర్నీ కొనసాగింది. అలా ఇద్దరి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత అది ప్రేమగా చిగురించింది. ఆ తర్వాత ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమను అశీర్వదించడంతో పెళ్లిపీటలెక్కారు నిరూపమ్, మంజుల. వీరి వైవాహిక బంధానికి ప్రతీకగా నిరూపమ్ దంపతులకు ఒక కుమారుడు ఉన్నారు. కాగా ఆదివారం (అక్టోబర 13) నిరూపమ్, మంజుల పెళ్లి రోజు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే తారీఖున మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారీ లవ్లీ కపుల్.
పెళ్లి రోజు కావడంతో నిరూపమ్, మంజులకు సోషల్ మీడియాలో అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిరూపమ్, మంజుల మరోసారి పెళ్లిచేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిరూపమ్ మరోసారి మంజుల మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిరూపమ్ దంపతులు. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు నిరూపమ్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో నిరూపమ్, మంజుల..
View this post on Instagram
15వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని..
View this post on Instagram
మంజుల, నిరూపమ్ ల పెళ్లి సందడి.. ఫుల్ వీడియో ఇదిగో..
పెళ్లికి ముందు ఇలా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..