Bigg Boss: బిగ్ బాస్‌కు ఊహించని షాక్.. మహిళా కమిషన్ నోటీసులు.. కారణమిదే

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలు రన్ అవుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఇప్పటికే ఆరు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టారు

Bigg Boss: బిగ్ బాస్‌కు ఊహించని షాక్.. మహిళా కమిషన్ నోటీసులు.. కారణమిదే
Bigg Boss Reality Show
Follow us

|

Updated on: Oct 13, 2024 | 3:56 PM

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో బిగ్ బాస్ రియాల్టీ షోలు రన్ అవుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ఇప్పటికే ఆరు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభమై రెండు వారాలైంది. అయితే ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వివాదాలు రేగుతూనే ఉన్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రామనగర పోలీసులు బిగ్‌బాస్‌ మేకర్స్ కు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభం నుంచే హౌస్ లో స్వర్గం- నరకం అనే కాన్సెప్ట్ నడుస్తోంది. . దీని ప్రకారం, మొదటి రోజు, కొంతమంది కంటెస్టెంట్‌లను స్వర్గానికి పంపారు. కొంతమంది పోటీదారులను నరకానికి పంపారు. నరకానికి వెళ్లిన కంటెస్టెంట్లు నేలపై వేసిన మంచంపై పడుకోవాల్సి వచ్చింది. వారికి ఆహారం బదులు గంజి మాత్రమే ఇస్తున్నారు. సీటింగ్ కూడా‌ ఏర్పాటు చేయలేదు. వారిని జైలు తరహా కడ్డీల వెనుక ఉంచారు. తాగునీటి కోసం ఒక కుండ మాత్రమే ఉంచారు. ఆహారం, నీరు, ఆఖరికి బాత్ రూమ్ వెళ్లాలనుకున్నా స్వర్గంలో ఉన్న కంటెస్టెంట్ల అనుమతిని అడగాలి. ఈ కాన్సెప్ట్ వల్ల వల్ల కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇప్పుడిదే కాన్సెప్ట్ కొంతమంది సామాజిక కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. బిగ్ బాస్ హౌస్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇష్టానికి విరుద్ధంగా ఏ వ్యక్తిని నిర్బంధంలో ఉంచలేమని, బిగ్ బాస్ హౌస్ లో పౌష్టికాహారం, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలు కూడా కల్పించకుండా మానవ హక్కులను ఉల్లంఘించారని నాగలక్ష్మి ఆరోపించారు. స్వర్గం-నరకం అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు, కొంతమంది కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఆడవారి గురించి చెడుగా మాట్లాడేవారు. కొంతమంది పోటీదారులు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రకటనలు ఇచ్చారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నాగలక్ష్మి కూడా పోలీసులకు లేఖ రాశారు.

ఇప్పుడు ఇదే విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులకు రామనగరలోని కుంబాలఘోడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ హూగర్ బిగ్ బాస్ వద్దకు వెళ్లి నిర్వాహకులకు నోటీసు జారీ చేసి, కొన్ని తేదీల ఫుటేజీని, దాని పూర్తి ఆడియోను అందించాలని కోరారు. ఎడిట్ చేయని రా వీడియోను పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా గతంలో కూడా బిగ్ బాస్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత బిగ్‌బాస్‌లో వర్తూరు సంతోష్‌ని అరెస్ట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్‌కు ఊహించని షాక్.. మహిళా కమిషన్ నోటీసులు.. కారణమిదే
బిగ్ బాస్‌కు ఊహించని షాక్.. మహిళా కమిషన్ నోటీసులు.. కారణమిదే
పూజారిని మింగేసిన హారతి..! ఆలయంలో పేలిన సిలిండర్‌..భయానక దృశ్యాలు
పూజారిని మింగేసిన హారతి..! ఆలయంలో పేలిన సిలిండర్‌..భయానక దృశ్యాలు
వెండి ఏనుగులను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందంటే..
వెండి ఏనుగులను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందంటే..
ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద 'దేవర' విధ్వంసం..
ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద 'దేవర' విధ్వంసం..
టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లు.. ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే..
టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లు.. ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే..
ఈ పాపను గుర్తు పట్టారా?జాబ్ మానేసి డ్యాన్సులు..ఇప్పుడేమో హీరోయిన్
ఈ పాపను గుర్తు పట్టారా?జాబ్ మానేసి డ్యాన్సులు..ఇప్పుడేమో హీరోయిన్
బాబా సిద్ధిఖీ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన..
బాబా సిద్ధిఖీ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన..
కీలక నిర్ణయం..ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ
కీలక నిర్ణయం..ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ
పట్టపగలే గూడ్స్ రైల్లో దోపిడీ.. టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు లూటీ..
పట్టపగలే గూడ్స్ రైల్లో దోపిడీ.. టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు లూటీ..
పౌర్ణమి సినిమాలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మాయి గుర్తుందా.. ?
పౌర్ణమి సినిమాలో ప్రభాస్ వెంటపడిన ఈ అమ్మాయి గుర్తుందా.. ?
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..
ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..