AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : బిగ్‏బాస్ షో హోస్ట్ చేయడానికి రూ.250 కోట్లు తీసుకున్న హీరో.. ఎవరంటే..

అక్టోబర్ 6న ఆదివారం సాయంత్రం హిందీలో బిగ్‏బాస్ సీజన్ 18 అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 19 కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఈసారి కంటెస్టెంట్ గానే ఓ గాడిదను కూడా పంపించారు. దీంతో ఇప్పుడు ఈ షో చూసేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడియన్స్.

Bigg Boss : బిగ్‏బాస్ షో హోస్ట్ చేయడానికి రూ.250 కోట్లు తీసుకున్న హీరో.. ఎవరంటే..
Bigg Boss Host
Rajitha Chanti
|

Updated on: Oct 07, 2024 | 5:19 PM

Share

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్. ఓవైపు విమర్శలు ఎన్ని వస్తున్నా.. ఈ షోకు రోజు రోజుకూ ఆదరణ పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఈ షో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ షో ఇప్పటివరకు పలు సీజన్స్ కంప్లీట్ చేసుకుని విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హిందీలో 18 సీజన్, తెలుగు, తమిళంలో సీజన్స్ 8 నడుస్తున్నాయి. అక్టోబర్ 6న ఆదివారం సాయంత్రం హిందీలో బిగ్‏బాస్ సీజన్ 18 అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 19 కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఈసారి కంటెస్టెంట్ గానే ఓ గాడిదను కూడా పంపించారు. దీంతో ఇప్పుడు ఈ షో చూసేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడియన్స్.

హిందీకి బిగ్‏బాస్ షోకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేస్తుండగా.. తెలుగు బిగ్‏బాస్ సీజన్ 8కు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ కన్నడలో కిచ్చా సుధీప్, తమిళంలో మొన్నటి వరకు కమల్ హాసన్ హోస్టింగ్ చేయగా.. ఇప్పుడు విజయ్ సేతుపతి హోస్ట్ గా మారారు. ఇదిలా ఉంటే.. వీరిలో బిగ్‏బాస్ షో హోస్టింగ్ చేయడానికి ఏకంగా రూ.250 కోట్లు పారితోషికం తీసుకున్నాడు ఓ హీరో. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట తెగ వైరలవుతుంది. అతడు మరెవరో కాదు.. బీటౌన్ స్టార్ సల్మాన్ ఖాన్.

అవును.. బిగ్‏బాస్ షో హోస్టింగ్ చేసినందుకు సల్మాన్ ఖాన్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నాడు. 2010లో సీజన్ 4 నుండి ఈ షోకు హోస్టింగ్ చేస్తున్నాడు సల్మాన్. అతని ఆకర్షణ, హాస్యం , హౌస్ లో కఠిన పరిస్థితులను నిర్వహించే నేర్పు సల్మాన్ హోస్టింగ్ కు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. అందుకే అటు జనాలు కూడా సల్మాన్ హోస్టింగ్ అంటే ఇష్టపడుతుంటారు. బిగ్ బాస్ 18 కోసం సల్మాన్ ఖాన్ పారితోషికం తక్కువేమీ కాదని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్ ఫీజు, మొత్తం కాంట్రాక్ట్ కలిపి అన్ని సీజన్‌లో నటుడు దాదాపు రూ. 250 కోట్లను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షో 15 వారాల పాటు నడుస్తుండగా, ఈ షోకు హోస్టింగ్ చేస్తున్నందుకు సల్మాన్ నెలవారీ సంపాదన దాదాపు రూ.60 కోట్లుగా తెలుస్తోంది. ఈసారి హౌస్ లోకి మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ అడుగుపెట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.