Brahmamudi, October 14th Episode: రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన అపర్ణ.. కావ్య, రాజ్‌లు కలిసిపోనున్నారా..

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. కిచెన్‌లో అపర్ణ, ఇందిరా దేవిలు వంట చేస్తూ ఉంటారు. అప్పడే అక్కడికి కనకం వచ్చి.. ఇదేంటండీ మీరు ఇవన్నీ చేస్తున్నారు.. జరగండి.. అని అంటుంది. దీంతో ఇందిరా దేవి.. కనకగానికి ఒక్క మొట్టికాయ ఇస్తుంది. అదేంటండీ అలా కొడుతున్నారు? అని కనకం అంటే.. అసలు నీకు బుద్ధి ఉందా? అని అపర్ణ, పెద్దావిడ అంటున్నారు. అసలు నువ్వు ఏం చెప్పి రాజ్‌ని ఇక్కడికి తీసుకొచ్చావ్? అని అడుగుతారు. అదే నాకు క్యాన్సర్..

Brahmamudi, October 14th Episode: రుద్రాణి ప్లాన్ తిప్పికొట్టిన అపర్ణ.. కావ్య, రాజ్‌లు కలిసిపోనున్నారా..
BrahmamudiImage Credit source: Disney Hot star
Follow us

|

Updated on: Oct 14, 2024 | 11:06 AM

ఈ రోజు బ్రహ్మముడి సీరియల్‌లో.. కిచెన్‌లో అపర్ణ, ఇందిరా దేవిలు వంట చేస్తూ ఉంటారు. అప్పడే అక్కడికి కనకం వచ్చి.. ఇదేంటండీ మీరు ఇవన్నీ చేస్తున్నారు.. జరగండి.. అని అంటుంది. దీంతో ఇందిరా దేవి.. కనకగానికి ఒక్క మొట్టికాయ ఇస్తుంది. అదేంటండీ అలా కొడుతున్నారు? అని కనకం అంటే.. అసలు నీకు బుద్ధి ఉందా? అని అపర్ణ, పెద్దావిడ అంటున్నారు. అసలు నువ్వు ఏం చెప్పి రాజ్‌ని ఇక్కడికి తీసుకొచ్చావ్? అని అడుగుతారు. అదే నాకు క్యాన్సర్.. త్వరలోనే చనిపోతున్నానని.. అంటూ అయ్యో మర్చిపోయాను అని అంటుంది. అర్థమైందా అందుకే కొట్టాను. అంటే ఈ క్యారెక్టర్ నాకు కొత్త కదా అందుకే మర్చిపోయాను. ఇక జీవించేస్తాను చూడండి.. నా పాత్రలో నేను జీవించేస్తాను అని కనకం అంటుంది. ఇక ఆ తర్వాత గదిలో కలర్ కలిపిన బాటిల్ గురించి వెతుకుంతుంది కనకం. అప్పుడే రాజ్ వచ్చి.. నా ఫ్రెండ్స్ డాక్టర్స్ అందరితోనూ మాట్లాడాను. అందులో ఒకరు డాక్టర్.. ఒకసారి మీ రిపోర్ట్స్ పంపించమని అడిగాడు. కాబట్టి ఒకసారి మీ రిపోర్ట్స్ ఇస్తే.. కనుక్కుంటానని రాజ్ అంటాడు. దీంతో కనకం షాక్ అవుతుంది. లేని రిపోర్ట్స్ నేను ఎక్కడి నుంచి తీసుకు రావాలి.. అంటూ కనకం కంగారు పడుతుంది.

కనకం రిపోర్ట్స్ అడిగిన రాజ్..

ఇప్పుడు అదంతా అవసరమా బాబూ అని కనకం అంటే.. ఇంత డబ్బు ఉండి కూడా మిమ్మల్ని కాపాడుకోలేక పోయాను. ఎన్ని కోట్లు ఖర్చు అయినా మిమ్మల్ని నేను కాపాడుకుంటానని రాజ్ బాధ పడతాడు. మీరు ఏమీ అనుకోకపోతే ఒక విషయం చెప్పనా.. నేను ఎన్ని రోజులు ఉంటానో తెలీదు. ఈ ఫంక్షన్ జరిపిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ఈ ఒక్క రోజు ఈ గొడవలన్నీ మర్చిపోయి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. రేపు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తానని కనకం అంటుంది. సరే అత్తయ్యా అని రాజ్ బయటకు వెళ్తాడు. ఇక కనకం హమ్మయ్యా అని బయటకు వెళ్తుంది కనకం. అప్పుడే కావ్య చేతులు కట్టుకుని నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? అని అడుగుతుంది. మా పెళ్లి రోజును మీ అత్తరింటి వాళ్లు గ్రాండ్ గా చేస్తున్నారని కనకం అంటుంది.

నేనే ఇదంతా చేస్తున్నా..

వాళ్లు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నువ్వు ఏదో చేశావు? మా అత్తగారు ఇదంతా చేస్తున్నారంటే సరే.. కానీ మీ అల్లుడు గారు కూడా వచ్చి ఇలా చేశారంటే.. నువ్వు ఏదో మెలిక చేశావు చెప్పు.. అని బెదిరిస్తుంది కావ్య. అప్పుడే అపర్ణ వచ్చి.. కావ్యని పక్కకు తీసుకెళ్తుంది. అది కాదు అత్తయ్యా మీ అబ్బాయికి నేను అంటేనే పడదు. అలాంటిది ఆయనే వచ్చి పని చేస్తున్నారంటే మా అమ్మ ఏదో చేసింది. దాని వల్ల మళ్లీ ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని భయపడుతున్నానని కావ్య అంటుంది. చేసింది మీ అమ్మ కాదు.. నేను. నా కొడుకు మనసులో ప్రేమ లేదు అన్నావు కదా.. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. తన మనసులో ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ వాడి అహంకారం వల్ల ఆ ప్రేమను దాచుకుని కోపాన్ని చూపిస్తున్నాడు. చెప్పినా వాడికి కూడా అర్థం కావడం లేదని అపర్ణ అంటుంది. మీరు అపోహ పడుతున్నారు అత్తయ్యా.. ప్రేమ లేదని అంటుంది.

ఇవి కూడా చదవండి

నీ మీద ప్రేమ బయట పెట్టేలా చేస్తాను..

అసలు ఏం అనుకుంటున్నారు మీరు? దగ్గర ఉంటేనే కదా చేసిన తప్పుల గురించి మాట్లాడుకుంటేనే కదా కలుస్తారు. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టిన రాజ్‌కి.. ఇప్పటికి ఎంత తేడా ఉంది. నువ్వు గమనించలేదా? నీకు వాడి మీద నమ్మకం లేక పోవచ్చు. కానీ నాకు ఉంది. నువ్వు కళ్ల ముందు ఉంటే అది బయట పడుతుందని అనుకుంటున్నా. అందుకే ఇదంతా చేస్తున్నానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఇందిరా దేవి, కనకాలతో కలిపి ఓ మాస్టర్ ప్లాన్ వేస్తుంది అపర్ణ. సేమ్ రుద్రాణి చేసిన ప్లాన్‌ని మళ్లీ రివర్స్ చేస్తుంది. ఇక బయట రాజ్.. డాక్టర్స్‌తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వేరే కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. హలో ఎవరు అని అంటారు.

అపర్ణ ప్లాన్ సక్సెస్..

సర్.. నేను మేనేజర్ శర్మని. ఇదేంటి కొత్త నెంబర్ నుంచి చేశావు? ఎందుకు ఇన్ని సార్లు చేస్తున్నావు? అని అడుగుతాడు రాజ్. మీరు ఇక్కడికి త్వరగా రాకపోతే కొంపలు ములిగిపోతాయి. మన కంపెనీ రెగ్యులర్‌గా కొనే గోల్డ్ కంటే ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఇది బయట పడితే మన కంపెనీ రెప్యుటేషన్ బయట పడుతుందని అంటాడు. దీంతో రాజ్ హడావిడిగా బయలు దేరతాడు. వెంటనే అపర్ణ, ఇందిరా దేవిలు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్? అని అడుగుతారు. ఇప్పుడే వచ్చేస్తాను.. ఆఫీస్‌లో పని ఉందని చెప్తాడు. అదేంటిరా.. కనకం పెళ్లి రోజును గ్రాండ్ గా చేస్తానని ఎక్కడికి వెళ్తున్నావు? అని అడుగుతారు. అయినా రాజ్ కంగారుగా వెళ్తాడు. ఆ తర్వాత మేనేజర్ శర్మకి ఫోన్ చేసి.. ఆ సిమ్ తీసి పక్కన పడేయ్. వాడు రాగానే నేను చేయలేదని చెప్పు అని చెప్తుంది.

కళ్యాణ్, ధాన్య లక్ష్మిల యుద్ధం..

కట్ చేస్తే.. రుద్రాణి రోట్లో దంచుతూ ఉంటుంది. అప్పుడే ధాన్య లక్ష్మి వచ్చి.. ఏం చేస్తున్నావ్? ఇక్కడ ఇంత మంది సంతోషంగా ఉంటే నువ్వు తట్టుకోలేవు కదా.. అందుకే అడుగుతున్నా. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావో.. రాజ్ మారిపోయి ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాడని తెలుసుకోవడానికే కదా అని అడుగుతుంది. ఏమీ లేదని రుద్రాణి అంటుంది. ఇంతకీ తెలుసుకున్నావా అని ధాన్య లక్ష్మి అడిగితే.. రాజ్ బయటకు వెళ్లిపోయాడు వచ్చాక తెలుసుకుంటానని రుద్రాణి అంటుంది. అప్పుడే కళ్యాణ్, అప్పూలు వస్తారు. కళ్యాణ్ రాగానే.. వెళ్లి పలకరిస్తుంది ధాన్య లక్ష్మి. ఎలా ఉన్నావు అమ్మా అని అడిగితే.. మీ అమ్మ దగ్గరకు రావడానికి ఇష్టం లేదా అని ధాన్య లక్ష్మి అడిగితే.. అందుకే ఇంటికి రాలేదని కళ్యాణ్ అంటాడు. ఈ దురదృష్టానికి దూరంగా ఉండమని చెప్పినా వినిపించుకోలేదు.. దీన్ని పెళ్లి చేసుకున్నా.. అద్దె కొంప.. అప్పులే కదా అని ధాన్య లక్ష్మి అంటే.. నీకు కూడా ఆ ఆనందం తెలిస్తే.. నువ్వు కూడా సంతోషంగా ఉంటావని కళ్యాణ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

44-30తో దబంగ్‌ ఢిల్లీపై పట్నా పైరేట్స్‌ గెలుపు
44-30తో దబంగ్‌ ఢిల్లీపై పట్నా పైరేట్స్‌ గెలుపు
కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
ఆకాశంలో విమానం ఇంజన్‌ ఆగిపోతే ఏమవుతుందో తెలుసా.?
ఆకాశంలో విమానం ఇంజన్‌ ఆగిపోతే ఏమవుతుందో తెలుసా.?
పొడవుగా ఒత్తైన జుట్టు కోసం కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పొడవుగా ఒత్తైన జుట్టు కోసం కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
ఓటీటీలో వణుకించే హారర్ మూవీ.. ఒంటరిగా చూడాలంటే..
ఓటీటీలో వణుకించే హారర్ మూవీ.. ఒంటరిగా చూడాలంటే..
బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు దూరం..పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ
బాలీవుడ్ మోజులో టాలీవుడ్ కు దూరం..పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ
కురుమూర్తి జాతరకు వేళాయే..! కాంచన గుహలో కొలువైన శ్రీవారి
కురుమూర్తి జాతరకు వేళాయే..! కాంచన గుహలో కొలువైన శ్రీవారి
OnePlus 13 మొబైల్‌ వచ్చిందోచ్‌.. 100W ఛార్జర్‌తో సూపర్‌ ఫీచర్స్‌!
OnePlus 13 మొబైల్‌ వచ్చిందోచ్‌.. 100W ఛార్జర్‌తో సూపర్‌ ఫీచర్స్‌!
పలమనేరు డీఎస్పీ ఎదుట హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
పలమనేరు డీఎస్పీ ఎదుట హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..
రూ. 8.5 కోట్లు ఇచ్చిన జీటీ.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియాలో బీభత్సం
రూ. 8.5 కోట్లు ఇచ్చిన జీటీ.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియాలో బీభత్సం