Bigg Boss Abhijeet: గుర్తు పట్టకుండా మారిపోయిన బిగ్ బాస్ విజేత అభిజిత్.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సాధారణంగా ఈ రియాలిటీషోలో పార్టిసిపేట్ చేసిన వాళ్లందరూ సినిమాల్లో బిజీ అయిపోవడమో లేదా టీవీ షోల్లోనో సందడి చేస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఒకతను మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచినప్పటికీ ఈ రంగుల ప్రపంచంపై కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు.

Bigg Boss Abhijeet: గుర్తు పట్టకుండా మారిపోయిన బిగ్ బాస్ విజేత అభిజిత్.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
Bigg Boss Abhijeet
Follow us

|

Updated on: Oct 14, 2024 | 12:15 PM

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. సాధారణంగా ఈ రియాలిటీషోలో పార్టిసిపేట్ చేసిన వాళ్లందరూ సినిమాల్లో బిజీ అయిపోవడమో లేదా టీవీ షోల్లోనో సందడి చేస్తుంటారు. అలాగే సోషల్ మీడియాలోనూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఒకతను మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచినప్పటికీ ఈ రంగుల ప్రపంచంపై కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. అతనే బిగ్ బాస్ సీజన్ 4 విజేత అభిజిత్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో పాటు కొన్ని సినిమాల్లోనూ నటించిన ఈ హ్యాండ్సమ్ యాక్టర్ బిగ్ బాస్ షో తోనే ఎక్కువ క్రేజ్ తెచుకున్నాడు. తన ఆట, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. స్టారాదిస్టార్లను కాదని బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ సొంతం చేసుకున్నాడు. దీంతో అభిజిత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక బిగ్ బాస్ తర్వాత అభిజిత్ నటుడిగా బిజీ అయిపోతారనున్నారు అతని అభిమానులు. కానీ అదేమీ జరగలేదు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తర్వాత అభిజిత్ కేవలం రెండు వెబ్ సిరీసుల్లో మాత్రమే నటించాడు. మెడ్రన్ లవ్ హైదరాబాద్ అంతాలజీ సిరీస్ లో ఒక కీలక పాత్ర పోషించిన అతను ఈ ఏడాదే విడుదలైన మిస్ పర్ ఫెక్ట్ సిరీస్ లోనూ మెప్పించాడు. ఇవి మినహా మరే సినిమాలు, టీవీషోల్లోనూ కనిపించలేదీ హ్యాండ్సమ్ యాక్టర్.

అభిజిత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటో..

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

కాగా అభిజిత్ కు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అందుకే ఇప్పుడు దేశమంతా పర్యటిస్తున్నాడు. రకరకాల ప్లేస్ లకు వెళ్లి గడపడం, ఆ విశేషాలలను సోషల్ మీడియాలో చేసుకోవడం ఇదే అభిజిత్ పని.

బైక్ రైడర్ గా అభిజిత్..

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

ప్రపంచ మంతా చుట్టేస్తూ..

అయితే అభిజిత్ కు కొన్ని అనారోగ్య సమస్యలున్నాయని తెలుస్తోంది. అందుకే మనశాంతి కోసం ఇలా దేశమంతా పర్యటిస్తున్నాడని తెలుస్తోంది. కాగా అప్పటికీ, ఇప్పటికీ అభిజిత్ బాగా మారిపోయాడు. బొద్దుగా గుర్తు పట్టలేకుండా ఉన్నాడు. వీటిని చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by Abijeet (@abijeet11)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.