Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth- Chalaki Chanti: ‘ఆస్పత్రిలో ఉన్నప్పుడూ ఎవరూ హెల్ప్ చేయలేదు.. ఇకపై జబర్దస్త్ చేయను’: చలాకీ చంటి

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో చలాకీ చంటి ఒకరు. అంతకు ముందు పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడీ స్టార్ కమెడియన్. ఆ తర్వాతే జబర్దస్త్ లో అడుగు పెట్టి టీమ్ లీడర్ అయ్యారు. చలాకీ చంటిగా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.

Jabardasth- Chalaki Chanti: 'ఆస్పత్రిలో ఉన్నప్పుడూ ఎవరూ హెల్ప్ చేయలేదు.. ఇకపై జబర్దస్త్ చేయను': చలాకీ చంటి
Chalaki Chanti Family
Follow us
Basha Shek

|

Updated on: Oct 14, 2024 | 10:32 AM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో చలాకీ చంటి ఒకరు. అంతకు ముందు పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడీ స్టార్ కమెడియన్. ఆ తర్వాతే జబర్దస్త్ లో అడుగు పెట్టి టీమ్ లీడర్ అయ్యారు. చలాకీ చంటిగా ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. బిగ్ బాస్‌ షోలోనూ కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు. ఇక పలు టీవీషోలకు హోస్ట్ గానూ మెప్పించాడు. ఇలా జబర్దస్త్ షో, సినిమాలతో బిజీ బిజీగా ఉంటే చంటి గతేడాది తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. హార్ట్ అటాక్ తో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న చలాకీ చంటి ఇప్పుడిప్పుడే బయట కనిపిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ స్టార్ కమెడియన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నేను హార్ట్ అటాక్ తో ఆస్పత్రిలో చేరినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం ఎవరూ పలకరించలేదు కూడా . కొంతమంది మాత్రమే ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాం అని అప్పుడు నాకు అర్థమైంది. డబ్బులు లేకపోతే ఎవరూ వచ్చి హెల్ప్ చేయరు. నేనే కాదు ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే. మనం కూడా ఎవరి దగ్గరా సాయం ఆశించకూడదు. స్నేహితులే అయినా డబ్బు విషయంలో హెల్ప్ చేయరు’ అని ఎమోషనల్ అయ్యాడు చంటి.

ఇవి కూడా చదవండి

తోటి కమెడియన్లతో చలాకీ చంటి..

ఇకపై జబర్దస్త్ చేయను.. కారణమిదే..

మళ్లీ జబర్దస్త్ చేస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ చలాకీ చంటి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. ‘ నేను మళ్లీ జబర్దస్త్ చేయను. నన్ను వాళ్లే వద్దన్నారు. అందుకు కారణం నాకు కూడా తెలీదు. కాబట్టి ఇక నేను మళ్లీ అడగను. అందరూ నాది ఈగో అనుకుంటారు. కానీ దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా అంటారు’ అని చెప్పుకొచ్చాడు చంటి. ప్రస్తుతం ఈ స్టార్ కమెడియన్ కామెంట్స్ వైరలవుతున్నాయి.

బిగ్ బాస్ షోలో చలాకీ చంటి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..