Ananya Pandey: వీడియోస్ లీక్ చేస్తానంటూ అనన్యకు ఆ స్టార్ హీరో బెదిరింపులు.. షాకింగ్ కామెంట్స్ వైరల్
గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో ఇటు దక్షిణాది అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అనన్యకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తోన్న ఈ బ్యూటీ తాజాగా ఓ స్టార్ హీరో కుమారుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
వీడియోస్ లీక్ చేస్తానని అనన్యను బెదిరించిన ఆ స్టార్ హీరో కొడుకు.. బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. బీటౌన్ సీనియర్ నటుడు చుంకీ పాండే ముద్దుల కూతురే ఈ బ్యూటీ. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రంతో ఇటు దక్షిణాది అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో అనన్యకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అలరిస్తోన్న ఈ బ్యూటీ తాజాగా ఓ స్టార్ హీరో కుమారుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అనన్య చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో తనయుడు వీడియోస్ లీక్ చేస్తానని తనను బెదిరించాడని తెలిపింది. అతడు మరెవరో కాదు.. బీటౌన్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్. అసలు విషయానికి వస్తే..
నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ చిన్ననాటి స్నేహితులు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొ్న్న అనన్య.. తన చిన్నతనంలో ఆర్యన్ తో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది. ఆ ఇంటర్వ్యూలో అనన్య మాట్లాడుతూ “రోజంతా నేనేం చేస్తాను, ఏం తింటాను.. అన్నీ వీడియోలో రికార్డ్ చేస్తుంటాను. కానీ వాటిని ఎప్పుడూ పబ్లిష్ చేయలేదు. ఇప్పటికీ ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. నేనూ, సుహానా ఖాన్, షానాయ కపూర్‌లు ఎప్పుడూ ఏదో ఒకటి రికార్డ్ చేసేవాళ్ళం… తర్వాత ఆర్యన్ మమ్మల్ని బెదిరించేవాడు. తాను చెప్పిన పని చేయకపోతే మా వీడియోస్ లీక్ చేస్తానని ఆర్యన్ ఎప్పుడూ బెదిరించేవాడు. అంతా చిన్ననాటి జ్ఞాపకాలే.. ” అంటూ సరదాగా చెప్పుకొచ్చింది అనన్య.
ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్. ప్రస్తుతం దుస్తుల వ్యాపారంలో బిజీగా ఉన్న ఆర్యన్.. బిజినెస్ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. త్వరలోనే తన చిత్రంతో అడియన్స్ ముందుకు రానున్నాడు. అనన్య ఇప్పటివరకు చాలా సినిమాల్లో పనిచేసింది. అతి తక్కువ సమయంలో అభిమానుల హృదయాలను ఏలింది. ఈ నటి రాబోయే సినిమా కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. నటి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.