AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో దుస్తులు మార్చుకున్న హీరోయిన్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్..

ఒకప్పుడు సినీ రంగంలో తారల కోసం ప్రత్యేకంగా కారవాన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్స్ కోసమే కాకుండా క్యారెక్టర్ ఆర్టి్స్టులు, కొరియోగ్రాఫర్స్ కోసం కూడా కారవాన్స్ ఉంటున్నాయి. అప్పట్లో కారవాన్స్ లేకపోవడంతో హీరోయిన్స్ రెడీ అయ్యేందుకు చాలా ఇబ్బందులు పడ్డారట. కొన్నిసార్లు చెట్ల చాటున దుస్తులు మార్చుకున్నామని బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్

Tollywood: రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో దుస్తులు మార్చుకున్న హీరోయిన్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్..
Vidya Balan
Rajitha Chanti
|

Updated on: Oct 05, 2024 | 7:34 PM

Share

ఒకప్పుడు సినీ రంగంలో తారల కోసం ప్రత్యేకంగా కారవాన్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్స్ కోసమే కాకుండా క్యారెక్టర్ ఆర్టి్స్టులు, కొరియోగ్రాఫర్స్ కోసం కూడా కారవాన్స్ ఉంటున్నాయి. అప్పట్లో కారవాన్స్ లేకపోవడంతో హీరోయిన్స్ రెడీ అయ్యేందుకు చాలా ఇబ్బందులు పడ్డారట. కొన్నిసార్లు చెట్ల చాటున దుస్తులు మార్చుకున్నామని బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఓ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే కారవాన్ లేకపోవడంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఇన్నోవా కారులో బాలీవుడ్ నటి విద్యాబాలన్ దుస్తులు మార్చుకోవాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దర్శకుడు సుజోయ్ ఘోష్. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ‘కహానీ’ సెట్స్‌లో ఈ సంఘటన జరిగింది. Mashable Indiaకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

2012లో ‘కహానీ’ సినిమా విడుదలైంది. రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.79.20 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో విద్యాబాలన్‌తోపాటు పరంబ్రత ఛటర్జీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, స్వస్థ ఛటర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు సుజోయ్ ఘోష్ ఈ తక్కువ బడ్జెట్ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు. తక్కువ బడ్జెట్‌తో నటీనటులు, ఇతరత్రా అవసరమైన సౌకర్యాలు కల్పించలేకపోయామని అన్నారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన విద్యాబాలన్ కు కారవాన్ ఇవ్వలేకపోయామని.. దీంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఇన్నోవా కారును నల్ల గుడ్డతో కప్పి, లోపల దుస్తులు మార్చుకుందని చెప్పారు.

కారవాన్, ఇతర సౌకర్యాలు కల్పించలేదు. అందుకు విద్యా బాలన్ మా సినిమా నుంచి తప్పుకోవచ్చు. కానీ ఆమె ముందు ఇచ్చిన మాట కోసం కహానీ సినిమాలో నటించింది. ఆ కాలంలోని నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి వారందరూ తమ మాటకు కట్టుబడి ఉన్నారు. అలాంటి వారిలో విద్యా ఒకరు అని సుజోయ్ ఘోష్ తెలిపారు.

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.