AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Ravali : నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. ఆ మాటలు ఎంతో బాధపెట్టాయి.. హీరోయిన్ రవళి తల్లి..

హీరోయిన్ రవళి.. ఈతరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు.. కానీ ఒకప్పుడు కుర్రవాళ్లకు ఇష్టమైన హీరోయిన్. చూడచక్కని రూపం.. అందమైన కళ్లు.. సహజ నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. కానీ కెరీర్ ఫాంలో ఉండగానే ఊహించని విధంగా సినిమాలకు దూరమైంది..

Actress Ravali : నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. ఆ మాటలు ఎంతో బాధపెట్టాయి.. హీరోయిన్ రవళి తల్లి..
Ravali
Rajitha Chanti
|

Updated on: Jan 12, 2026 | 12:27 PM

Share

ఒకప్పుడు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్లలో రవళి ఒకరు. ఇప్పుడంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. అప్పట్లో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే అనే పాటతో చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంటుంది. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో అలరించింది. సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన హీరోయిన్లలో ఆమె ఒకరు. అప్పట్లో స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన ఆమె.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. అయితే అప్పట్లో ఓ వెలుగు వెలిగిన రవళి.. అనుహ్యంగా సినిమాలకు దూరం కావడంపై ఆమె తల్లి విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయదుర్గ తన కూతుర్ల సినీప్రయాణాల గురించి మాట్లాడుతూ.. తన కూతుర్లు రవళి, హరిత సినిమాలు చేయడం ఎందుకు ఆపేశారో వెల్లడించారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన విజయ దుర్గ, ఒంటరిగా ముగ్గురు పిల్లలను పెంచడంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. సమాజం నుండి ఎదురైన అపార్థాలను, విమర్శలను ధైర్యంగా ఎదుర్కొని పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడమే తన లక్ష్యంగా కష్టపడినట్లు ఆమె తెలిపారు. వంద రూపాయలు సంపాదిస్తే డెబ్బై రూపాయలే మనవని, మిగిలిన ముప్పై మనవి కాదని తన పిల్లలకు నేర్పినట్లు వెల్లడించారు. అందుకే రవళి ఒక సినిమాకు పదిహేను, ఇరవై లక్షలు తీసుకోకుండా, ఐదు లక్షల పారితోషికంతోనే సంతృప్తి పడిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

రవళి కెరీర్ ఆగిపోవడానికి గల కారణాలు వెల్లడించింది. విజయదుర్గ మాట్లాడుతూ.. తన కూతురు బరువు పెరిగిందని అప్పట్లో వచ్చిన వార్తలే రవళి కెరీర్ ఆగిపోవడానికి కారణమని అన్నారు. అలాగే కొత్త హీరోయిన్లు తెరంగేట్రం చేయడం కూడా మరో కారణమని అన్నారు. తన కూతురు బరువు పెరిగిందని.. బొద్దుగా మారిందని వచ్చిన వార్తలు తమను ఎంతో బాధించాయని, “లావు అయితే సినిమాలు చేయకూడదా?” అని ప్రశ్నించారు. 2004లో రవళి వివాహం నిమిత్తం చెన్నై నుండి హైదరాబాద్‌కు మారినట్లు ఆమె తెలిపారు. రవళి 2007లో వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారని, చిరంజీవి గారి స్టాలిన్ చిత్రం ఆమె చివరిదని అన్నారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?
బర్మా గ్యాంగ్.. రోహింగ్యాల టార్గెట్ ఏంటంటే..?
30ఏళ్లు పైబడిన మహిళలకు ఇది అమృతంతో సమానం..! బోలెడు ప్రయోజనాలు..
30ఏళ్లు పైబడిన మహిళలకు ఇది అమృతంతో సమానం..! బోలెడు ప్రయోజనాలు..
చలి మీ కళ్లను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?.. లైట్ తీసుకుంటే డేంజరే
చలి మీ కళ్లను ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?.. లైట్ తీసుకుంటే డేంజరే
చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు
చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు