మహారాష్ట్రలోని సతారా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్య ప్రసవం కోసం సెలవుపై వచ్చిన జవాన్ ప్రమోద్ జాదవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొన్ని గంటల తర్వాత ఆయన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్ట్రెచ్చర్‌పై భార్య, పక్కన నవజాత శిశువు, మధ్యలో నిర్జీవంగా పడి ఉన్న జవాన్‌ను చూసి అందరి కళ్లు చెమర్చాయి.