12 January 2026
బ్యూటీని వేంటాడుతున్న బ్యాడ్ లక్.. సంక్రాంతి సైతం కలిసిరాలేదుగా..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. పెళ్లి సందడి సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత ధమాకాతో హిట్టు కొట్టింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. ఇప్పుడు మాత్రం సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది ఈ అందాల రాశి.
తాజాగా ఈ బ్యూటీకి సంక్రాంతి పండగ తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆమె నటించిన పరాశక్తి సినిమాకు తమిళనాడులో అంతగా రెస్పాన్స్ రావడం లేదు.
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా.. డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ పరాశక్తి. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది.
సంక్రాంతి పండగ సందర్భంగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు మిక్డ్స్ టాక్ వస్తుంది.
అయితే కొన్నాళ్లుగా శ్రీలీల సరైన హిట్టు కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే పరాశక్తి పై భారీ హైప్ పెంచుకుంది.
కానీ చివరకు ఈ మూవీ సైతం నిరాశే మిగిల్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్లాపులు రావడంతో ఇప్పుడు కోలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది.
అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన పరాశక్తి మాత్రం ఆమెకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా మార్చుకుంది శ్రీలీల.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్