AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ధురంధర్, పుష్ప 2 సినిమాలను మించిపోయింది.. 9 ఏళ్లుగా బాక్సాఫీస్‏ను శాసిస్తున్న ఏకైక మూవీ.. ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్..

ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీ అడియన్స్ ముందుకు వస్తుంటాయి. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ మూవీ మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికీ ఆ మూవీ రికార్డ్ మరో సినిమా బ్రేక్ చేయలేకపోతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటీ అనుకుంటున్నారా.. ?

Cinema : ధురంధర్, పుష్ప 2 సినిమాలను మించిపోయింది.. 9 ఏళ్లుగా బాక్సాఫీస్‏ను శాసిస్తున్న ఏకైక మూవీ.. ఓటీటీ ట్రెండింగ్‏లో నెంబర్ వన్..
Dangal Movie
Rajitha Chanti
|

Updated on: Jan 12, 2026 | 11:59 AM

Share

ఇటీవల కాలంలో ఓటీటీలో సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అటు థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు.. కేవలం 45 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ ఒక సినిమా మాత్రం ఇప్పటికీ చెరగని రికార్డ్ సొంతం చేసుకుంది. థియేటర్లలో తుఫాను సృష్టించిన మూవీ.. ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. పుష్ప 2, ధురంధర్ వంటి చిత్రాలు సైతం ఆ మూవీ రికార్డ్ బద్దలుకొట్టలేకపోయాయి. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఆ మూవీ దూసుకుపోతుంది. దాదాపు 2 గంటల 41 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా విడుదలై 9 సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. టీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఆ మూవీ రికార్డును బద్దలు కొట్టలేకపోయాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్ర చర్చ నడుస్తుంది.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

9 సంవత్సరాల తర్వాత కూడా నెట్‌ఫ్లిక్స్‌ను ఏలుతున్న సినిమా పేరు దంగల్. అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ 2016లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. పుష్ప 2, ధురంధర్ వంటి ప్రముఖ చిత్రాలను కూడా అధిగమించి దంగల్ టాప్ 10లో నిలిచింది. తన కూతుర్లను ప్రతిభావంతులైన రెజ్లర్స్ గా మార్చేందుకు ఓ తండ్రి పడిన ఆరాటమే ఈ సినిమా.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, అతని కుమార్తెలు గీతా ఫోగట్, బబితా ఫోగట్ జీవితం ఆధారంగా దంగల్ చిత్రం తెరకెక్కించారు. ఒక తండ్రి సమాజ నియమాలకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతాడు.. ? తన కుమార్తెలకు రెజ్లింగ్ రంగంలో ఎలా శిక్షణ ఇచ్చాడు.. ? అనేది చూపిస్తుంది. కూతుళ్ల పోరాటం, తండ్రి కఠినమైన క్రమశిక్షణ, విజయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో అమీర్ ఖాన్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. స్టార్ హీరో అయినప్పటికీ హీరోయిజం చిత్రాలు కాకుండా ఇద్దరు కూతుర్లకు తండ్రిగా .. అద్భుతమైన నటనతో కట్టిపడేశారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే