Nalgonda: బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలు రోయ్.. వాళ్ల టార్గెట్ అదేరోయ్..
బర్మాదేశం నుండి అక్రమంగా శరణార్ధులుగా దేశంలోకి చొరబడిన రోహింగ్యాలు ఎంతోమంది ఉన్నారు. వారంతా పొట్టకూటి కోసం వివిధ పనులు చేసి బతుకుతున్నారు. కానీ ఇపుడు రోహింగ్యాలు అంటే సామాన్యులకే కాదు.. పోలీసులకు కూడా వణుకు పుడుతోంది. ఆ రోహింగ్యాలు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బర్మా దేశానికి చెందిన హమీద్ హుస్సైన్, జహాంగీర్ ఆలం, షఫిక్ ఆలం, మహమ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, కైసర్, నూర్ ఖాసింలు 2012- 13లో రోహింగ్యాలుగా దేశంలోకి చొరబడ్డారు. వీరంతా హైదరాబాద్ బాలానగర్‌లోని రాయకల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సమీప ప్రాంతాల్లో చిన్న చిన్న ఇత్తడి, కాపర్ దొంగతనాలు చేస్తూ స్క్రాప్ షాపులో అమ్ముతూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం జిల్లాలకు వచ్చి షాపులను లూఠీ చేయడం మొదలెట్టారు. ఏడుగురు దొంగల ముఠా ఓ ఆటోలో ఈనెల ఏడవ తేదీన హైదరాబాదు నుండి నల్లగొండకు వచ్చారు. అద్దంకి – నార్కెట్ పల్లి రహదారి పక్కనున్న నిధి పైపుల కంపెనీపై కన్నేశారు. సెక్యూరిటీ గార్డ్ లేకపోవడంతో గేటు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. పైపుల తయారీకి వినియోగించే ఇత్తడి సైజర్లు (40), అమరాన్ బ్యాటరీలు (35), UPS కేబుల్స్, ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ వైర్ 50 కేజీలు దొంగిలించారు. వీటన్నిటిని తీసుకెళ్లలేక పైపుల కంపెనీ వెనుక భాగంలో చెట్ల పొదల్లో దాచి బాలాపూర్‌కు వెళ్లారు. దొంగిలించిన మెటీరియల్‌ను తీసుకువెళ్లేందుకు రోహింగ్యాల ముఠాకు చెందిన ముగ్గురు సోమవారం నల్లగొండకు ఆటలో బయలుదేరారు. ఈ మెటీరియల్‌ను ఆటోలో లోడ్ చేసుకొని వెళుతుండగా.. చర్లపల్లి శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. పోలీసులను చూసి ఆటోను ఆపకుండా వెళుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చి చేసి ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠాపై మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు ఉన్నాయని, ఈ రోహింగ్యాలు జైలుకు కూడా వెళ్లి వచ్చారని పోలీసులు చెబుతున్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న రోహింగ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
