12 January 2026
అందంలోనే కాదు ఆస్తులలోనూ తగ్గేదేలే.. త్రిష సంపాదన ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాదిలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో త్రిష ఒకరు. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.
రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ సైతం ఆమె. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా.. ?
ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే యాడ్స్, ప్రమోషనల్ పోస్టుల ద్వారా భారీగానే సంపాదిస్తుందట.
అలాగే పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా సంవత్సరానికి దాదాపు రూ.9 కోట్ల వరకు సంపాదిస్తుంది. ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు.
ఇదెలా ఉంటే త్రిషకు చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో సొంతంగా ఇళ్లు ఉన్నాయి. హైదరాబాద్ ఇంటి విలువ రూ.6 కోట్లు ఉంటుందని టాక్.
త్రిష తన సంపాదనను ఎక్కువగా లగ్జరీ కార్లపై పెట్టింది. మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ (విలువ రూ. 80 లక్షలు), బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ (విలువ రూ. 75 లక్షలు)
రేంజ్ రోవర్ ఎవోక్ (విలువ రూ. 60 లక్షలు), మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ (విలువ రూ. 63 లక్షలు) ఉన్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్