AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Head: ఓరి బాబోయ్.. చేప తలకాయ తింటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..?

చేప తలకాయలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ నియంత్రణ, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇది అందిస్తుంది. రుచితో పాటు ఆరోగ్యానికి చేప తలకాయ ఎంతో మేలు చేస్తుంది.

Fish Head: ఓరి బాబోయ్.. చేప తలకాయ తింటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..?
Fish Head
Ram Naramaneni
|

Updated on: Jan 12, 2026 | 7:44 PM

Share

తరచుగా చేపలు తినేటప్పుడు, చాలామంది నడుము ముక్కలకు లేదా చేప ఫ్రై, ఇగురు వంటి రుచికరమైన వంటకాలకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే వైద్య నిపుణులు ప్రకారం చేప పులుసు వంటి వంటకాలు మంచివని, రోస్ట్, ఫ్రై వంటి వేపుడు కూరల వల్ల చేపలోని పోషకాలు నశించిపోతాయని అంటున్నారు. రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, చేప తలకాయలో దాగి ఉన్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోవడం అవసరం. చేప తలను ఎలా తినాలో నేర్చుకుంటే, జీవితంలో ఎప్పటికీ వదలరని కొందరు చెబుతుంటారు.

పోషకాల గని చేప తలకాయ: చేప తలకాయలో మాంసకృత్తులతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బీ2, విటమిన్ డి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు కూడా అధిక మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు పిల్లల నుంచి వృద్ధుల వరకు, గర్భిణీ స్త్రీలు, బాలింతలతో సహా అందరికీ మంచివని వైద్యులు చెబుతున్నారు.

పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు:

1. షుగర్ నియంత్రణ: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి చేప తలకాయ తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు లెవల్ అవుతాయి. ఇది క్లోమ గ్రంథిలోని బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు దీనిని తినడం మంచిది.

2. గుండె ఆరోగ్యం: చేప తలకాయ గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును లెవల్ చేసి, బీపీ పెరగకుండా నియంత్రిస్తుంది.

3. మెదడు పనితీరు మెరుగుదల: చేప తలకాయను తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఇది నరాల బలహీనతను నివారిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధిని కొంతవరకు నిరోధిస్తుంది.

4. కంటి చూపు మెరుగుదల: విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, రేచీకటిని నివారిస్తుంది.

5. క్యాన్సర్ నివారణ: శరీరంలోని క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి, రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

6. రోగనిరోధక శక్తి పెంపు: శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి, అతిసార వ్యాధి, కలరా, టైఫాయిడ్, టీబీ, న్యుమోనియా వంటి అంటువ్యాధులతో పాటు కోవిడ్-19, మంకీపాక్స్, డెంగ్యూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.

7. ఎముకల బలం: ఎముకలు గట్టిపడతాయి, వృద్ధాప్యంలో వచ్చే ఎముక పెళుసుదనాన్ని నివారిస్తుంది. నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించి, తుంటి ఎముక విరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

8. చర్మ సౌందర్యం: చర్మాన్ని కాంతివంతంగా, నిగనిగలాడేలా చేస్తుంది. మొటిమలు, పొక్కులు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది.

9. కేశ సౌందర్యం: వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చిట్లడం వంటి సమస్యలను నివారిస్తుంది.

10. మానసిక ప్రశాంతత: మానసిక ఒత్తిడి, డిప్రెషన్, టెన్షన్, ఆందోళన వంటి సమస్యలను అధిగమించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇది గాఢ నిద్రకు కూడా తోడ్పడుతుంది.

ఈ పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చేప తలకాయను ఎలా తినాలో తెలుసుకుని, దానిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. దాని రుచిని, ఆరోగ్య లాభాలను ఒక్కసారి అనుభవించిన తర్వాత, ఎప్పటికీ దీనిని వదలరని, రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినా తలకాయ ముక్కనే అడిగి తెప్పించుకునే పరిస్థితి వస్తుందని వారు అంటున్నారు.

(Note: ఇందులోని సమాచారం వైద్య నిపుణులు నుంచి సేకరించినది. ఇది అందరి బాడీ టైప్స్‌కు సెట్ అవ్వాలని ఉండదు. మీకు ఎలాంటి అనుమానాలున్నా వైద్యులు లేదా డైటీషియన్లు సంప్రదించండి)

చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు
చేప తలకాయ గురించి తెలిస్తే తినకుండా అస్సలు వదలరు
మంగళవారం హనుమంతుడి పూజతో శుభాలన్నీ మీవెంటే.. ఇలా చేయండి
మంగళవారం హనుమంతుడి పూజతో శుభాలన్నీ మీవెంటే.. ఇలా చేయండి
ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
ఇండియాలో ఈ 10 పర్యాటక ప్రదేశాలను విజిట్ చేయడంపై బ్యాన్..
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
అవాంఛిత రోమాల‌తో బాధ‌ప‌డుతున్నారా?ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..
తెలంగాణలో జరిగిన రియల్ స్టోరీ.. ఇప్పుడు OTT టాప్ ట్రెండింగ్‌లో..
రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే..
రొయ్యలు తిన్న తర్వాత ఇవి తిన్నారో మీ పని అయిపోయినట్లే..
చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?
చిగుళ్లలో బ్లీడింగ్? డయాబెటిస్, గుండె జబ్బులకు సంకేతమా?
WPL 2026: ఆ మూడు మ్యాచ్‌లకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?
WPL 2026: ఆ మూడు మ్యాచ్‌లకు నో ఎంట్రీ.. కారణం ఏంటంటే?
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?
సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?